Don't Miss!
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అక్కడ సూపర్ హిట్...తెలుగులో ఆడుతుందా?
హైదరాబాద్: తమిళంలో హిట్టైన సినిమాలు ఇక్కడ ఆడతాయా...తెలుగులో మంచి పేరున్న హీరో సిద్దార్దకు ఇప్పుడు అదే టెన్షన్ పట్టుకుంది. ఆయన తాజా చిత్రం 'జిగర్‌దండా' మొన్న శుక్రవారం విడుదలై తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. లక్ష్మీమీనన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం తెలుగులో త్వరలో విడుదల కానుంది. చిక్కడు ..దొరకడు టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇక్కడ డబ్ చేసారు. మదురైలో మంచి ఆదరణ ఉన్న పానీయం..'జిగర్‌దండా' . ఇప్పుడా రుచిని దక్షిణాది ప్రజలకు పరిచయం చేస్తున్నారు నటుడు సిద్ధార్థ్.
'పిజ్జా' వంటి పెద్ద హిట్ చిత్రాన్ని అందించిన కార్తిక్‌సుబ్బురాజ్ దీనికి దర్శకత్వం వహించటంతో అక్కడ రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. మరోవైపు లక్ష్మీమీనన్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటంతో కూడా ఓపినింగ్స్ అద్బుతంగా వచ్చాయి. అయితే తెలుగులో ఇప్పటికే ట్రైలర్, పాటలు పెద్దగా ఇక్కడ మన యూత్ ని ఆకట్టుకోలోకపోయాయి. తమిళ వాసన ఎక్కువ ఉండటంతో ఇక్కడెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రిలీజ్ అయ్యాక సినిమాలో విషయం ఉంది కాబట్టి ఆడే అవకాసం ఉందంటున్నారు.
ఇప్పుడు సిద్దార్ధ, లక్ష్మీమీనన్, బాబీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కర్నూలు, హైదరాబాద్ బ్యాక్‌గ్రౌండ్‌లో, శంకర్ 'ఐ' సినిమాకు వాడిన అత్యాధునిక టెక్నాలజీ కెమెరాని ఈ చిత్రానికి ఉపయోగించారు. రెండు సంవత్సరాలపాటు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.
ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకునే అంశం ఈ సినిమా దర్శకుడు. తమిళ్లోనే కాక తెలుగులో కూడా తన మొదటి చిత్రంతోనే కమర్షియల్ సక్సెస్‌ని సాధించిన 'పిజ్జా' సినిమా దర్శకుడు కార్తిక్ సుబ్బురాజ్ ఈ 'చిక్కడు దొరకడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, అదే టీమ్ ఈ చిత్రానికి పని చేసారు.
సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్ ప్రపంచాన్ని టచ్ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్ మధ్య ట్రావెల్ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్ అవుతుంది. ఆడియన్స్ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్ గ్యాంగ్‌స్టర్ లవ్‌స్టోరీగా తెరకెక్కింది.
మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, కెమెరా: సంతోష్ నారాయణ్, ఎడిటింగ్: వివేక్ హర్షన్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్: ఎ.ఎన్.బాలాజీ (సూపర్‌గుడ్ మూవీస్), నిర్మాత: కదిరేశన్, దర్శకుడు: కార్తిక్ సుబ్బురాజ్.