నేను, సిద్ధార్ఠ, నిత్యా మీనన్ పోటీపడి నటించాం
నేను, సిద్ధార్ఠ, నిత్యామేనన్ పోటీపడి నటించాం. ఒక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఇందులో ఉంటుందని చెప్పగలను అంటోంది ప్రియా ఆనంద్. అలాగే ఇంతకుముందు తాను నటించిన 'లీడర్', 'రామరామ... కృష్ణకృష్ణ' చిత్రాల్లో చేసిన కేరెక్టర్లకు, '180'లో కేరక్టర్ పూర్తిగా డిఫరెంట్ అంటుంది అంటోంది ప్రియా ఆనంద్. జయేంద్ర దర్శకత్వంలో సిద్ధార్థ్, నిత్యామీనన్, ప్రియాఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం '180'. 'ఈ వయసికరాదు' అనేది ఉపశీర్షిక. సత్యం సినిమాస్, అఘాల్ ఫిల్మ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి శరత్ సంగీతం సమకూర్చారు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించింది ప్రియ ఆనంద్. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కూడా చెప్పాశానంటోంది. కానీ ఇందులో కథ గురించి గానీ, టైటిల్ '180' అర్థం గానీ ఇప్పటికీ నాకు తెలీదు. నా క్యారెక్టర్ వరకే తెలుసు.
ఇందులో నేను బబ్లీగా ఉండే ఓ ఎన్నారై అమ్మాయిగా నటిస్తున్నా. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు ఇది భిన్నం. వెస్ట్రన్ కల్చర్‌తో ఓ సంపన్న కుటుంబంలో పెరిగిన అమ్మాయి...భారతీయ సంప్రదాయనికి ఏ విధంగా అలవాటు పడుతుంది అనే పాత్రలో నటించా. ఇందులో నాపేరు రేణుక నారాయణన్. నేను ఇందులో మిమిక్రీ కూడా చెబుతా.ఫారిన్ నుంచి వచ్చిన అమ్మాయి అనగానే పొగరుగానే చూపించడం చాలా సినిమాల్లో జరిగింది. కానీ ఇందులో అలాకాదు. రెండు దేశాల సంప్రదాయాలనూ గౌరవించే పాత్ర నాది. ఈ సినిమాలో నా పాత్ర మిమిక్రీ కూడా చేస్తుంది. ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశాను అంది. '180" 'ఈ వయసిక రాదు" చిత్రం ద్వారా 500లకు పైగా యాడ్ ఫిలిమ్స్‌కు దర్శకత్వం వహించిన జయేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కిరణ్ రెడ్డి, స్వరూప్‌రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్‌లో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











