దిల్ రాజుతో భయంకరంగా గొడవపడిన సిద్దార్ద
దిల్ రాజుతో భయంకరంగా గొడవ పడ్డాను. అయితే అది 'ఓ మై ఫ్రెండ్" సినిమా బాగా రావటం కోసమే అంటున్నాడు సిద్దార్ద. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా 'దిల్" రాజు నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్" గతవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ సిద్దార్ధ ఇలా స్పందించారు. అలాగే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ సినిమా ఐదు రోజులు హౌస్‌ఫుల్ కావడమే గొప్ప. 'ఓ మై ఫ్రెండ్" యువతరాన్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడిప్పుడే కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అన్ని సినిమాలూ 'బొమ్మరిల్లు" కాలేవు. దేనికదే ప్రత్యేకం అన్నారు సిద్దార్థ్. ఇక తాను ఈ చిత్రంలో కాలేజ్ అబ్బాయిగా కనపడాలని దర్శకుడు చెపితే కొంచెం ఇబ్బంది పడ్డాను. తన కాన్ఫిడెన్స్ చూసి ఓకే చెప్పా.
ఇలాంటి సినిమా తీయడం సాహసమని అల్లు అరవింద్ మెచ్చుకున్నారు. నవదీప్, శృతి హాసన్, హన్సికతో కలిసి నటించడం హ్యాపీ అనిపించింది. 'దిల్" రాజుతో ప్రతి ఏటా ఓ సినిమా చేయాలని ఉంది. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది అన్నారు. ''ఓ మై ఫ్రెండ్' చిత్రం నాతో చేయాలని వేణు శ్రీరామ్ రెండు సంవత్సరాలు ఎదురుచూశారు. ఆయన అనుకున్నది తెరపై చూపించారు. బొమ్మరిల్లు చిత్రంలో సిద్ధు కంటే ఈ చిత్రంలోని చందూయే యువకుడిలా కనిపించాడనే మాట నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని చివరి 20 నిమిషాలు సినిమాకి ప్రాణం పోశాయి అని చెప్పారు.


Click it and Unblock the Notifications











