ఎన్నోసార్లు లవ్ లో ఫెయిలయ్యా: సిద్దార్ద
ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్యూర్ అనే పదానికి నాకు తెలిసినంత అర్థం ఎవరికీ తెలియదేమో. ఎందుకంటే నేను ఎన్నోసార్లు లవ్ విషయంలో ఫెయిలయ్యాను అంటున్నారు సిద్దార్ధ. ఆయన తాజా చిత్రం లవ్ ఫెయిల్యూర్ ఆడియో విడుదల నిన్న(శనివారం)రాత్రి హైదరాబాద్ ప్రసాద్ మల్టి ప్లెక్స్ లో జరిగింది. ఈ సందర్భంగా సిద్దార్ధ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రాన్ని సిద్దార్ధ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ విషయం చెపుతూ..నా జీవితంలోనే ఇది ప్రత్యేకమైన రోజు. ఇన్నాళ్లూ నేను మీకు హీరోగానే తెలుసు.
తొలిసారిగా నేను ఇప్పుడు 'లవ్ ఫెయిల్యూర్'తో నిర్మాతగా మీ ముందుకొస్తున్నాను అన్నారు. సినిమా గురించి చెపుతూ..ప్రేమించాలి అనుకుంటున్నవాళ్లు, ప్రేమించుకుంటున్నవాళ్లు మా సినిమాకి రండి. వాళ్ల ప్రేమ తప్పక సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో అమలాపాల్ పేరు పార్వతి. ఈ సినిమా తర్వాత అందరూ ఆమెను పార్వతి అని పిలుస్తారు. అంత బాగా నటించింది. 'బాయ్స్' తర్వాత నేను, తమన్ కలిసి పని చేస్తున్న సినిమా ఇది. దూకుడు, బిజినెస్‌మేన్ తర్వాత తన మ్యూజిక్ డెరైక్షన్‌లో వస్తున్న గ్రేట్ ఆల్బమ్ 'లవ్ ఫెయిల్యూర్'. ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని సిద్ధార్ధ్ అన్నారు. సిద్ధార్ధ్ హీరోగా నటిస్తూ, బాలాజీమోహన్ దర్శకత్వంలో కె.వేణుగోపాల్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'లవ్ ఫెయిల్యూర్'. ఈ ఫంక్షన్ లో అమలాపాల్, తమన్ కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











