సమంతతో లవ్ ఎఫైర్ విషయమై సిద్దార్ద ట్వీట్

By Srikanya

హైదరాబాద్: శ్రీకాళహస్తిలో సమంత, సిద్దార్ధ రాహుకేతు పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇద్దరి మధ్యా లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఈ విషయమై ట్వీట్ చేస్తూ...." నా ప్రెవేట్ లైఫ్ కి చెందిన రూమర్స్...గురించి అయితే నేనే ఏదన్నా చెప్పుకోతగ్గ విషయం ఉంటే షేర్ చేసుకుంటాను... అలా రూమర్స్ వ్యాపింప చేయటం మాత్రం పద్దతి కాదు...." అని ట్వీట్ చేసారు. అయితే సమంత లవ్ ఎఫైర్ విషయమై మాత్రం ఆయన ఖండించకపోవటం గమనార్హం.

సమంతపై ఈ మధ్య రూమర్లు తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సమంత కనిపించినంత అమాయకురాలు కాదని... తెర వెనక చాటు మాటు ప్రేమ వ్యవహారాలు నడిపిస్తోందని సదరు రూమర్ల సారాంశం. తన కోస్టార్ సిద్ధార్థతో డేటింగ్ చేస్తోందనే వార్తలను ఇటీవల ఖండించిన సమంత తనపై ఎలాంటి పుకార్లు వెలువడకుండా స్పష్టమైన వివరణ ఇచ్చింది. తన సీక్కెట్ ప్రేమ, పెళ్లి వివరాలను బట్ట బయలు చేసింది.

ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ... తన పర్సనల్ లైఫ్ గురించి చర్చించింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం ఒప్పేసుకుంది. 'అవును నేను ప్రేమలో ఉన్నాను' అని వ్యాఖ్యానించింది. అయితే తన ప్రియుడు ఎవరనే విషయం బయట పెట్టడానికి మాత్రం సమంత నిరాకరించింది. తన ప్రేమ వ్యవహారం పూర్తిగా ప్రైవేట్ మ్యాటరని, దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ మరో మూడు సంవత్సరాల తర్వాత అని వెల్లడించింది.

ఇక సమంత సినీ జీవితం విషయానికొస్తే.... 2010లో 'ఏ మాయ చేసావె' చిత్రం ద్వారా సినిమాల్లోకి తెరంగ్రేటం చేసిన సమంత ఆ సినిమా విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆమో తెలుగు, తమిళం బాషల్లో దాదాపు 10 సినిమాల వరకు చేసింది. దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. దీంతో సమంత లక్కీ హీరోయిన్ గా మారి పోయింది. స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు ఆమె ఉంటేనే సినిమా చేస్తాం అనే పరిస్థితి తయారైంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జబర్ ధస్త్ చిత్రం మాత్రం ఫెయిలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X