సౌందర్య, ఆర్తి అగర్వాల్ మధ్యలో హీరో ఫొటో.. బ్రతికుండగానే దారుణంగా.. షాకింగ్ రియాక్షన్
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తమిళ హీరోలలో సిద్దార్థ్ ఒకరు. మొదట కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కాస్త హడావుడిగానే సపోర్టింగ్ రోల్స్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగు జనాలు మాత్రమే అతనికి హీరోగా ఒక స్టార్ డమ్ ను అందించారు. అందుకే ఇక్కడి ప్రేక్షకులంటే సిద్ధార్థ్ కు చాలా ఇష్టం. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త చురుగ్గా కనిపిస్తున్న సిద్దార్థ్ ఇటీవల ఒక యూ ట్యూబ్ వీడియోకు, ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే అందులో సిద్దార్థ్ చనిపోయినట్లు ప్రచారం చేశారు.

భాషతో సంబంధం లేకుండా
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ ఆ తరువాత భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేశాడు. ముఖ్యంగా తెలుగులో అతను చేసిన మొదటి సినిమాలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

హారర్ మూవీ గృహంతో
ఇక వరుసగా లవ్ స్టోరీలతో లవర్ బాయ్ గా గుర్తింపు అందుకున్న సిద్దార్త్ కొన్ని అపజయాల అనంతరం లాంగ్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. రొటీన్ సినిమాలు ఎక్కువయ్యాయి అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఫైనల్ గా 2017లో హారర్ మూవీ గృహంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.

సౌందర్య, ఆర్తి అగర్వాల్ మధ్యలో సిద్దార్థ్
అయితే ఒకప్పుడు సినిమాలతో బిజీగా కనిపించిన సిద్దార్థ్ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కామెంట్స్ పై ఎక్కువగా రియాక్ట్ అవుతూ.. వైరల్ అవుతున్నాడు. ఇటీవల యంగ్ ఏజ్ లో మరణించిన తారలు అని ఒక యూ ట్యూబ్ కు సంబంధించిన వీడియోపై ట్వీట్ చేశాడు. అందులో సౌందర్య, ఆర్తి అగర్వాల్ వంటి దివంగత నటిమణుల ఫొటోలో మధ్యలో సిద్దార్థ్ ఫొటో కూడా ఉంది.

పాపాత్ముల్లారా అనే రియాక్షన్
యూ ట్యూబ్ లో వ్యూవ్స్ కోసం ఎంతకైనా దిగజారడం కామన్ అయిపోయిందని నెటిజన్లు ఆ వీడియో లింక్ కు సిద్దార్థ్ ను ట్యాగ్ చేశారు. ఇక సిద్దార్థ్ మాత్రం ఆ వీడియోపై ఇదివరకే యూ ట్యూబ్ దృష్టికి తీసుకువెళ్లాడట. అయితే అందులో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని అటు నుంచి సమాధానం వచ్చిందట. దీంతో సిద్దార్థ్ పాపాత్ముల్లారా అనే రియాక్షన్ ఇచ్చినట్లు ట్విట్టర్ లో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











