రీమేక్ కమిటైన సిద్దార్ధ... డిటేల్స్
హైదరాబాద్ : సిద్ధార్థ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ కొత్త చిత్రం రూపొందనుంది. కన్నడంలో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన 'లూసియా' ని రీమేక్ చేస్తునవ్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషలలో రీమేక్‌కానుంది. ఈ విషయమై సిద్దార్ధ చాలా ఉత్సాహంగా ట్వీట్ చేసారు.
అలాగే తెలుగు, తమిళ వెర్షన్ రెండింటిలోనూ సిద్ధార్థ్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని 'విల్లా', 'పిజ్జా' చిత్రాల నిర్మాత సి.వి.కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రసాద్ రమర్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ చిత్రం జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' చిత్రం తర్వాత తర్వాత సిద్దార్ధ్ నటిస్తున్న చిత్రమిదే.
డజనుకు పైగా చిత్రాల్లో నటించిన సిద్దార్ధకు 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' మినహా మరో హిట్ లేకపోవడంతో అతని కెరీర్ దాదాపుగా మోడువారిపోయింది. సిద్దార్ధ నటించిన 'చుక్కల్లో చంద్రుడు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ' వంటి చిత్రాలతోపాటు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'అనగనగా ఓ ధీరుడు' అత్యంత ఘోరంగా నిరాశపరడం.. నిర్మాతలు మొదలుకుని కొనుగోలుదారులు, పంపిణీదారులందర్నీ తీవ్ర స్థాయిలో నష్టపరచడం తెలిసిందే. ఈ నేపధ్యంలో సిద్దార్థ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఈ చిత్రం కూడా హిట్ కాని పక్షంలో ఇప్పటికే క్షీణ దశలో ఉన్న సిద్దార్ధ కెరీర్ మరింత క్లిష్ట పరిస్థితిలో పడే ప్రమాదముంది.


Click it and Unblock the Notifications












