Siddharth-Adithi Rao Hydari: సీక్రెట్ గా పెళ్లి చేసుకొన్న అదితి రావు, సిద్దార్థ్.. 100 ఏళ్ళకు పైగా గుడిలో
Siddharth-Adithi Rao Hydari: గత ఏడాది కాలంగా సినీ ఇండస్ట్రీలో పెళ్లి భజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్ లోనూ సినీ సెలబ్రెటీలు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఇప్పటికే రకుల్, పరణితి చోప్రా, కియారా అద్వానీ, కృతి కర్భందా తదితర హీరోయిన్స్ తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి.. మ్యారేజ్ లోకి అడుగుపెట్టారు. తాజాగా మరో స్టార్ హీరో, హీరోయిన్ లు తమ ప్రేమ బంధాన్ని శుభం కార్డు వేసి.. పెళ్లి పీటలెక్కారు. ఇంతకీ ఆ ఇండస్ట్రీ లవ్ బర్స్ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.
ఈ ఇండస్ట్రీ లవ్ బర్డ్ ఎవరో కాదండీ..బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ - హీరోయిన్ అదితి రావ్. గత కొంత కాలంగా సిద్దార్ధ్, హైదరాబాదీ హీరోయిన్ అదితీరావు రిలేషన్ లో ఉన్నారు. వాస్తవానికి వీరిద్దరికి 'మహాసముద్రం' అనే సినిమా సెట్ స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్తా క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు గత రెండేళ్లుగా వీరిద్దరరూ ప్రేమలో ఉన్నారని టాక్. గతంలో వీరి విషయం వెలుగులోకి వచ్చింది. హీరో సిద్ధార్థ్ - హీరోయిన్ అదితి రావ్ లు డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే.. గత వారం రోజుల క్రితం వీరి పెళ్లి గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ వార్తలపై మొదట హీరో సిద్దార్థ స్పందించారు. తాము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలా మంది మాట్లాడుకుంటున్నారనీ, అయితే.. సీక్రెట్,ప్రైవేట్ అనే పదాలకు ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. తమ ఎంగేజ్‌మెంట్‌కు ఎవరినైతే పిలువాలనుకున్నానో వారిని మాత్రమే పిలిచాననీ, కానీ, ఇది సీక్రెట్ ప్రోగ్రామ్ అసలూ కాదని అన్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ ప్రోగ్రామ్ జరిగిందనీ, వెడ్డింగ్ డేట్ ను తమ పెద్దల నిర్ణయిస్తారని వెల్లడించారు.
ఆ తరువాత హీరోయిన్ అదితిరావ్ స్పందించారు. ఎంగేజ్ మెంట్, మ్యారేజ్ ఎక్కడ జరగబోతుందనే విషయాలపై త్వరలో క్లారిటీ ఇస్తాననీ, హీరో సిద్ధార్థ్ తనకు మహాసముద్రం షూటింగ్ సమయంలో పరిచయం అయ్యాడని తెలిపారు. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని అన్నారు. సిద్దార్థ తన ప్రేమను వ్యక్తపరిచిన తీరు తనకెంతో నచ్చిందని తెలిపారు. తమకు నిశ్చితార్థం జరిగిన వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో జరిగిందని తెలిపారు.
అంతలోనే సిద్ధార్థ్, అదితి రావు హైదరీ షాకిచ్చారు. పెళ్లి తేదీ ప్రకటించకుండానే వీరిద్దరూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో సంప్రదాయ పద్దతిలో వీరద్దరూ పెళ్లి చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా అదితితో సిద్ధార్థ్ ఏడడుగులు వేశాడు.
అదితి తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. "నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే" అంటూ తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ నవజంటకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ , నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











