twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జర్నలిస్టులకు క్షమాపణ చెప్పిన సిద్దార్ధ

    By Srikanya
    |

    మొత్తానికి సిద్దార్ద దిగి వచ్చి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పుకున్నారు. ఆయన తాజాగా ట్విట్టర్ లో ఈ మెసేజ్ ను ఉంచారు. గతంలో నేను న్యూస్ ఛానెల్స్ గురించి చేసిన ట్వీట్ కొందరు జర్నలిస్టులను, వారి కుటుంబాలను భాద పెట్టిందని తెలిసింది. అయితే అది వారి కుటుంబాలను గురించి కాదు... వారి చేసిన చర్యలు గురించి.. నేను వేరే ఉద్దేశ్యంతో ఆ ట్వీట్ ఇవ్వలేదు. వారి కుటుంబాల సెంటిమెంట్ ను హర్ట్న చేసినందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను అన్నారు. అయితే ఈ ట్వీట్ వెనక దిల్ రాజు ప్రెజర్ ఉందన్న సంగతి బహిరంగ రహస్యమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ సినిమా విడుదలకు దగ్గర పడింది. సిద్దార్ద చేసిన పనని దృష్టిలో పెట్టుకుని అతనిపై ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ పెట్టింది. దాంతో తన సినిమాకు సైతం దెబ్బతగులుతోందని భావించిన దిల్ రాజు ఈ విధంగా ట్వీట్ ఇప్పించాడని సమాచారం.

    ఇంతకుముందు కూడా '180" చిత్రానికి మీడియా సహకరించకపోవటంతో నిర్మాతకు చాలా లాస్ వచ్చింది. దాంతో మండిన దిల్ రాజు తన సినిమాకు, తన బిజెనెస్ కు దెబ్బకొట్టే పనులు చేయవద్దని లెప్ట్ అండ్ రైట్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రిందట సిద్దార్ధపై ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ పెట్టి, మాకి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సిద్దార్ధకు మా అశోశియేషన్ వాళ్ళు నోటీసులు కూడ జారీ చేసారు. అయితే సిద్దార్ద చాలా కూల్ గా ఉన్నాడు. మీడియా వారు మాత్రం సిద్దార్ద ఎట్టి పరిస్దితుల్లోనూ క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపట్టి ఈ ట్వీట్ ఇప్పించాడని తెలుస్తోంది.

    English summary
    Siddharth has apologised to the media fraternity and journalists for a remark he made in the past. He posted the apology on his twitter account “In reference to one of my tweets in the past regarding certain news channels -My comment should have targeted only them for their actions but not their families.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X