సిద్ధార్థ లేటెస్ట్ చిత్రం 'బావ' సెన్సార్ కట్స్ ఇవే...
'బావ'గా సిద్ధార్థ టైటిల్ రోల్ పోషించిన చిత్రం క్రిందటి నెలాఖారులో విడుదలై మొదటి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. శ్రీకీర్తి కంబైన్స్ పతాకం పై ఎం.ఎల్.పద్మకుమార్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ ని అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'బావ' చిత్రాన్ని చూసి 5 కట్స్‌తో 'యు' సర్టిఫికెట్‌ని 27.10.2010 న జారీ చేసింది. ఆ కట్స్ ఏమిటంటే...
1. ఒకటి, రెండు రీళ్లలో చిత్రీకరించిన దృశ్యాల్లోని 'ఊరపంది నాయాల్లారా' అనే మాటల్ని తొలగించి శబ్దం వినపడకూడదన్నారు.
2. అయిదు, ఆరు రీళ్లలో దేవుళ్లు, వంకాయలు పైన చిత్రీకరించి జోక్స్‌ని తొలగించారు. (దేవుళ్ల పేర్లను తొలగించి అంగీకరించిన వంకాయలు వుంచారు) శబ్దం వినరాకూడదన్నారు.
3. అయిదు, ఆరు రీళ్లలోనే చిత్రీకరించిన 'కాయ కోస్తా' అనే పదాన్ని శబ్దంతో సహా తొలగించారు.
4. అయిదు, ఆరు, పదకొండు, పన్నెండు రీళ్లలో 'చంక నాకుతున్నారా అనే మాటలు ఎక్కడ వచ్చినా వాటిని తొలగిస్తూ శబ్దం వినబడకూడదన్నారు.
5. అయిదు ఆరు రీళ్లలో చిత్రీకరించిన దృశ్యాల్లో ఎన్ స్టూడియోకి సంబంధించి వున్న 'ఆల్రెడీ అమ్మేసుకున్నాడు' అనే పదాల్ని తొలగించి, శబ్దం వినబడకూడదన్నారు.
16 రీళ్ల నిడివిగల 'బావ' చిత్రం 29.10.2010 న విడుదలైంది.
ఈ చిత్తరంలో ప్రణీత, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్ ముఖ్యపాత్రధారులు. శ్రీకీర్తి కంబైన్స్ పతాకాన ఎం.ఎల్.పద్మకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి డైరక్టర్ గా రాంబాబు పరిచయమయ్యారు.


Click it and Unblock the Notifications











