మహేష్ 'ఖలేజా' తనకు ట్విస్ట్ ఇస్తోందంటున్న సిద్ధార్థ
ప్రిన్స్ (మహేష్) సినిమా సంగతి తెలిస్తే, 'బావ' విడుదల తేదీ నిర్ణయిస్తా అంటున్నాడు సిద్దార్ద.ఆయన తాజాగా ట్విట్టర్ లో తన లేటెస్ట్ చిత్రం బావ గురించి ట్వీట్ చేస్తూ..ముగ్గురు సూపర్‌స్టార్ల సినిమాలు (మహేశ్ 'ఖలేజా', పవన్ కల్యాణ్ 'కొమరం పులి', ఎన్టీఆర్ 'బృందావనం') ఒక్కోటి కనీసం 400 ప్రింట్లతో విడుదలవుతాయి. సినిమా విడుదలకు థియేటర్లు దొరకడం కీలకం. థాంక్‌గాడ్..పవర్‌స్టార్ (కొమరం పులి) ఆగస్టులో వస్తున్నాడు. లేదంటే ఈ 'భారీ' సినిమాలతో నా లిటిల్ బేబీ ('బావ') పరిస్థితి ఏమవుతుందో!" అని ట్విట్టర్ లో రాసుకున్నారు సిద్ధార్థ్.
అలాగే రాఘవేంద్రరావు కుమారుడుతో చేస్తున్న చిత్రం గురించి చెబుతూ...కోవెలమూడి సూర్యప్రకాశ్ డైరెక్షన్‌లో డిస్నీ వాళ్లు నిర్మిస్తున్న సినిమా టైటిల్ చాలా బాగుంది. ఆ టైటిల్ ఏమిటో త్వరలో ప్రకటిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో 2011 జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. '180' సినిమా అదే ఏడాది ఏప్రిల్‌లోనూ, కొత్త 'క్రేజీ' సినిమా జూలైలోనూ విడుదలవుతాయి.నా 'బావ' దాదాపు 250 ప్రింట్లతో విడుదలవబోతోంది.
సిద్ధార్థ్ కథానాయకుడిగా రూపొందుతున్న 'బావ' చిత్రం 250 ప్రింట్లతో విడుదల కాబోతోంది. ఈ సంగతిని సిద్ధార్థ్ స్వయంగా తెలిపారు. అయితే ఆ సినిమా విడుదల తేదీ మహేశ్ సినిమా 'ఖలేజా' విడుదల తేదీ మీద ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. "ఎన్టీఆర్ 'బృందావనం', రజనీకాంత్ 'ఎందిరన్' (రోబో) ఎప్పుడు రిలీజవుతాయో నాకు తెలుసు అన్నారు. అంటే మహేష్ చిత్రం రిలీజ్ తర్వాత తన చిత్రం విడుదల పెట్టుకుందామని ఎదురుచూస్తున్నాడన్నమాట. ఇలా ఎన్ని చిత్రాలు రిలీజ్ లు వాయిదా పడనున్నాయో...


Click it and Unblock the Notifications











