రెండేళ్ల దాకా దొరకను: సిద్దార్ధ
ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న హీరో సిద్దార్ధ, మరికొన్ని ప్ర్రాజెక్టులను సైతం ఒకే అన్నట్టు విశ్వసనీయ సమాచారం. దాదాపు మరో రెండేళ్ల వరకు తన డైరీలో ఖాళీ లేదని సిద్దార్ధే స్వయంగా 'ట్విట్టర్" లో రాసుకున్నాడు. ఇప్పుడు తాను చేస్తున్న సినిమాలు, చెయ్యడానికి ఒప్పుకున్న సినిమాలన్నీ కలిపి తనకు సుమారుగా 100 కోట్ల దాకా ఆర్జించి పెడతాయని అంటున్నాడు. ప్రస్తుతం కొత్తగా కర్నాటక నుండి ఆంధ్రాకు దిగుమతి అయిన కన్నడ సుందరి ప్రణీతతో 'బావ' అనే సినిమా చేస్తున్న సిద్దార్ధ, కె. ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు..
సిద్దార్ద బావ ప్రణీత కె ప్రకాష్ రాజేంద్ర ప్రసాద్ ట్విట్టర్ siddharth bava pranitha k prakash rajendra prasad twitter


Click it and Unblock the Notifications