కె.విశ్వనాథ్, బాలూమహేంద్ర లాగా ప్రేక్షకుల్ని మభ్య పెట్టము - సిద్దార్థ
అప్పట్లో కె.విశ్వనాథ్, బాలూమహేంద్ర లాంటివాళ్లు తీసిన హై థాట్ ఫిల్మ్‌లాగా ప్రేక్షకుల్ని మభ్య పెట్టే సినిమా నాది కాదు. ఓ నిజాయతీ ప్రయత్నమిది అంటున్నారు సిద్దార్ధ. ఈ లవర్ బోయ్ తాజా చిత్రం '180"ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే..రెగ్యులర్ సిద్దార్థ్ సినిమాలా ఈ '180" ఉండదు. నేను చేసిన తొలి ద్విభాషా చిత్రం ఇది. మొదట తెలుగు షాట్ తీసి, తర్వాత తమిళ షాట్ తీయడం... ఇలా ఒకే సీన్‌ని రెండు భాషల్లో చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తాయి. బ్రెజిల్‌లో కొన్ని సీన్స్ తీశాం. సహజత్వం కోసం పోర్చుగీస్‌లో ఓ పాట కూడా చిత్రీకరించాం. రెడ్ డిజిటల్ కెమెరాతో సినిమా అంతా తీశారు అంటూ చెప్పుకొచ్చారు.అంతా బాగానే ఉందికానీ మధ్యలో కె.విశ్వనాధ్ ని, బాలూ మహేంద్ర గొడవ మధ్యలో తీసుకురావటం ఎందుకో ఎవరకీ అర్దం కాలేదు.


Click it and Unblock the Notifications











