»   » చిన్న పిల్లాడిలా ఏడ్చిన సిద్ధార్థ

చిన్న పిల్లాడిలా ఏడ్చిన సిద్ధార్థ

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    గత కొన్ని రోజుల క్రితం హీరో సిద్దార్థ మీడియాపై తన ఆగ్రహాన్ని వెల్లగక్కడంతో పాటు, రిపోర్టలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత మెత్తబడ్డ సిద్ధార్థ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ కూడా చెప్పారు. అయితే సిద్ధార్థ క్షమాపణ చెప్పడం వెనక చాలా పెద్ద డ్రమానే నడించిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చాలా రోజుల క్రితం జరిగిన ఈ డ్రామా వెనక అసలు విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

    అప్పడు మీడియాపై సిద్ధార్థ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యూస్ ఛానల్స్ అన్ని అతనికి సంబంధించిన ఏ సినిమా గురించి కూడా పబ్లిసిటీ చేయవద్దని నిర్ణయించుకున్నాయి. దీంతో అప్పటికే సిద్దార్ధతో ఓ సినిమా కమిట్ అయిన నిర్మాత దిల్‌రాజు ఈ వివ్యహారంపై సిరీయస్ అయ్యాడు. వెంటనే మీడియాకు సారీ చెప్పాలని, సారి చెప్పకుంటే మన సినిమా పబ్లిసీటీ జరుగక నష్టపోతామని సిద్దార్థ వివరించారు. అయితే సిద్ధార్థ దిల్ రాజు ప్రతిపాదనకు ఒప్పుకోలేదట. దీంతో దిల్ రాజు సిద్దుపై సీరియస్ అయినట్లు తెలుస్తూంది.

    ఇదే సమయంలో ఈ వ్యవహారంలో ఇన్ వాల్వ్ అయిన ప్రకాష్ రాజ్ సిద్దార్థను కన్విన్స్ చేసి...అతనితో మీడియాకు సారీ చెప్పించాడని చర్చించుకుంటున్నారు. మీడియాకు సారీ చెప్పిన వెంటనే సిద్ధార్థ పక్కకు వెళ్లి బోరున ఏడ్చాడట. తనపై ఒత్తిడి తెచ్చి మీడియాకు సారీ చెప్పించిన దిల్ రాజును బండ బూతులు తిట్టుకున్నాడట. మీడియాపై నేను చేసిన కామెంట్లలో తప్పేముంది? వాళ్లు నాగురించి నాన్ సెన్స్ న్యూస్ రాస్తే తప్పు లేదుగానీ...నేను వాళ్లను తప్పు బడితే తప్పా? అంటూ తెగ ఫీలైపోయాడట.

    English summary
    Siddharth agreed uninterestingly and said 'sorry' to media in a press meet organized at Dil Raju's office. After the Press Meet, Siddhu went inside and broke down into tears. He was angry on Dil Raju for forcing him to do something he hates.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more