Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిన్న పిల్లాడిలా ఏడ్చిన సిద్ధార్థ
గత కొన్ని రోజుల క్రితం హీరో సిద్దార్థ మీడియాపై తన ఆగ్రహాన్ని వెల్లగక్కడంతో పాటు, రిపోర్టలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత మెత్తబడ్డ సిద్ధార్థ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ కూడా చెప్పారు. అయితే సిద్ధార్థ క్షమాపణ చెప్పడం వెనక చాలా పెద్ద డ్రమానే నడించిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చాలా రోజుల క్రితం జరిగిన ఈ డ్రామా వెనక అసలు విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అప్పడు మీడియాపై సిద్ధార్థ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యూస్ ఛానల్స్ అన్ని అతనికి సంబంధించిన ఏ సినిమా గురించి కూడా పబ్లిసిటీ చేయవద్దని నిర్ణయించుకున్నాయి. దీంతో అప్పటికే సిద్దార్ధతో ఓ సినిమా కమిట్ అయిన నిర్మాత దిల్‌రాజు ఈ వివ్యహారంపై సిరీయస్ అయ్యాడు. వెంటనే మీడియాకు సారీ చెప్పాలని, సారి చెప్పకుంటే మన సినిమా పబ్లిసీటీ జరుగక నష్టపోతామని సిద్దార్థ వివరించారు. అయితే సిద్ధార్థ దిల్ రాజు ప్రతిపాదనకు ఒప్పుకోలేదట. దీంతో దిల్ రాజు సిద్దుపై సీరియస్ అయినట్లు తెలుస్తూంది.
ఇదే సమయంలో ఈ వ్యవహారంలో ఇన్ వాల్వ్ అయిన ప్రకాష్ రాజ్ సిద్దార్థను కన్విన్స్ చేసి...అతనితో మీడియాకు సారీ చెప్పించాడని చర్చించుకుంటున్నారు. మీడియాకు సారీ చెప్పిన వెంటనే సిద్ధార్థ పక్కకు వెళ్లి బోరున ఏడ్చాడట. తనపై ఒత్తిడి తెచ్చి మీడియాకు సారీ చెప్పించిన దిల్ రాజును బండ బూతులు తిట్టుకున్నాడట. మీడియాపై నేను చేసిన కామెంట్లలో తప్పేముంది? వాళ్లు నాగురించి నాన్ సెన్స్ న్యూస్ రాస్తే తప్పు లేదుగానీ...నేను వాళ్లను తప్పు బడితే తప్పా? అంటూ తెగ ఫీలైపోయాడట.