మహేష్ అయినా ఇంకెవరైనా.... అతనికంటే వెనకే!
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు... టాలీవుడ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న హీరో. హీరో సిద్ధార్థ విషయానికొస్తే ఓ మోస్తరు రేంజి ఉన్న హీరో. ఏ విషయంలో చూసినా మహేష్ బాబుకు, సిద్ధార్థకు చాలా తేడా ఉంటుంది. అసలు మహేష్ బాబును ఊహలో కూడా అందుకోలేని స్థాయి సిద్దార్థది. కానీ ఓ విషయంలో మాత్రం సిద్ధార్థ మహేష్ బాబును బీట్ చేశాడు.
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న హీరో ఎవరంటే మహేష్ బాబు పేరు ముందుగా వినిపించేది. కానీ ఇప్పడు మహేష్ బాబును అధిగమించి ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో నెం.1 పొజిషన్లోకి వెళ్లాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం సిద్ధార్థ ట్విట్టర్లో 5,00,000 మ్యాజికల్ ఫిగర్‌ను క్రాస్ చేశాడు. 4,16,403 మంది ఫాలోవర్స్‌తో మహేష్ బాబు రెండో స్థానంలో ఉన్నాడు. సౌతిండియా యాక్టర్లలో ట్విట్టర్లో ఈ ఫీట్ సాధించిన తొలి హీరో సిద్ధార్థ మాత్రమే.
ఈ విషయమై ఆయన ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేస్తూ...'అందరికీ థాంక్స్ చెప్పారు. సౌతిండియాలో 500000 ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న తొలి యాక్టర్ నేనే కావడం ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేసాడు. సిద్ధార్థ ప్రస్తుతం నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. బెల్లకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. దీంతో పాటు ఇంగ్లీష్‌లో 'విండ్స్ ఆఫ్ చేంజ్', ఎన్‌హెచ్2 అనే తమిళ చిత్రంలో, మరో హిందీ చిత్రంలో నటిస్తున్నాడు.
మరో వైపు నిర్మాతగాను రాణించేందుకు చిన్న బడ్జెట్ చిత్రాలపై కన్నేశాడు. వీర్య దానం కథాంశంతో బాలీవుడ్‌లో రూపొందిన 'వికీ డోనర్' చిత్రం రీమేక్ ప్లాన్స్‌లో ఉప్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగు, తమిళం రీమేక్ హక్కులను సిద్ధార్థం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను ఇటీవల స్థాపించిన 'ఇటాకి ఎంటర్ టైన్మెంట్స్' బేనర్ పై ఈచిత్రాన్ని నిర్మించే యోచనలో ఉన్నాడు సిద్ధార్థ.


Click it and Unblock the Notifications











