11-11-11పై కన్నేసిన సిద్ధార్థ, దిల్ రాజు
సిద్ధార్థ, శృతి హాసన్ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో 'ఓ మై ఫ్రెండ్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను 11-11-11 తేదీనాడు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తూంది. ఈ తేదీ రోజున విడుదల చేస్తే సినిమాకు కలిసొస్తుందని, ఇలాంటి తేదీ వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కనుక సినిమా వంద రోజులు ఆడుతుందని వారి నమ్మకమట.
ఓ మై ఫ్రెండ్ సినిమా ఒక సున్నితమైన రొమాంటిక్ ప్రేమకథ ఆధారంగా రూపొందిస్తున్నారు. సిద్ధార్థ సరసన శృతి హాసన్ నటిస్తుండగా...నవదీప్-హన్సిక మరో ప్రధానమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆడియోనే ఈ రోజు(అక్టోబర్ 15) శిల్పకళా వేదికలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరి 11-11-11 తేదీపై నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు-సిద్ధార్థల నమ్మకం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











