Takkar Twitter Review: సిద్ధార్థ్ 'టక్కర్'కి ఊహించని టాక్.. అసలైందే మిస్.. క్లైమాక్స్ మాత్రం అలా!

తెలుగు ప్రేక్షకుల్లో మంచి నటుడిగా స్థానం సంపాదించుకున్న హీరోల్లో సిద్ధార్థ్ ఒకరు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి తదితర సినిమాలతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ అలరిస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్ నటించిన మూవీ టక్కర్. జూన్ 9న అంటే ఇవాళ థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో టక్కర్ ట్విటర్ రివ్యూలో (Takkar Twitter Review) తెలుసుకుందాం.

హిందీ చిత్రాలు:

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాలతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. తర్వాత వరుసగా ప్లాప్ మూవీస్ ద్వారా ఆయన క్రేజ్ తగ్గింది. గతేడాది ఒరేయ్ బామ్మర్ది సినిమాతో అలరించిన సిద్ధార్థ్ నేరుగా చేసిన తెలుగు చివరి మూవీ మహాసముద్రం. అనంతరం తమిళం, హిందీ చిత్రాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న ఈ హీరో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు

మజిలీ బ్యూటి:హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రమే టక్కర్. తమిళ దర్శకుడు కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Siddharth Divyansha Kaushik Takkar Movie Twitter Review

రిచ్ అయ్యాడా?:తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న టక్కర్ మూవీ ప్రీమియర్ షోలను చెన్నై, యూఎస్ లో నిన్న రాత్రి ప్రదర్శించారు. అవి చూసిన నెటిజన్లు ట్వీట్స్ ద్వారా టక్కర్ మూవీపై అభిప్రాయం తెలియజేస్తున్నారు. "ఒక మధ్య తరగతి యువకుడు ధనవంతుడు కావాలని చెన్నైకి వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు? మరి అతను రిచ్ అయ్యాడా అనేదే మెయిన్ కథ" అని ఒకరు తెలిపారు.

యోగిబాబు కామెడీ:"టక్కర్ ఫస్టాఫ్ అమెజింగ్ గా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ టెర్రిఫిక్. ఎప్పటిలాగే యోగిబాబు అదరగొట్టాడు. ఆద్యంతం తన కామెడీతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్ రేసీగా సాగుతుంది. చాలా కాలం తర్వాత ఫీల్ గుడ్ అండ్ కమర్షియల్ మూవీ చూశాను" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.

క్లైమాక్స్ అలా:"టక్కర్ నాకు నచ్చలేదు. ఫస్టాఫ్ డల్ గా ఉంది. సెకండాఫ్ కూడా అంతగా ఎం బాగోలేదు మాస్ సన్నివేశాలు, లవ్ సీన్లు ఎక్కడా వర్కౌట్ కాలేదు. సాంగ్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల యోగిబాబు కామెడీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. డిసప్పాయింటెడ్" అని ఒక ట్విటర్ యూజర్ తెలిపారు.

మిక్స్ డ్ టాక్:"టక్కర్ ఫస్టాఫ్ యావరేజ్ గా ఉంది. సెకండాఫ్ డీసెంట్ గా ఉంది. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. సాంగ్స్ బాగున్నాయి. కానీ యాక్షన్, ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. సిద్దార్థ్ నుంచి మరో ప్లాప్ మూవీ. త్వరలోనే మళ్లీ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడని ఆశిద్దాం" అని 2 స్టార్ రేటింగ్ ఇచ్చింది ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ థైవ్యూ. అలాగే మరికొందరు టక్కర్ మూవీపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే మూవీకి ఓవరాల్ గా మిక్స్ డ్ టాక్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X