అన్నా హజారేపై మాట మార్చిన సిద్ధార్థ
అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నా హజారేకు ఇతర సీనీస్టార్స్ తో పాటు హీరో సిద్దార్థ కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు సిద్దార్థ మాట మార్చాడు. హజారే అన్నీ మంచి పనులే చేస్తున్నాడని నేను నమ్మడం లేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై సిద్దార్థ మాట్లాడుతూ....'అవినీతి అనేది దేశానికి పట్టిన ఒక వ్యాధి. దాన్ని నిర్మూలించేందుకు హజారే పోరాడుతున్నారు. కాదనడం లేదు. అయితే హజారేకు మద్దతు పలుకున్న వారంతా అవినీతి వ్యతిరేకులు, అతన్ని వ్యతిరేకించే వారంతా అవినీతి మద్దతు దారులు అనే భావన సరికాదు. హజారే ప్రశాంత్ భూషణ్, అరవింద్ క్రేజీ వాల్ చెబుతున్న మాటలనే నమ్ముతున్నారు. ఆయనకు సొంత అభిప్రాయాలు లేనట్లు కనిపిస్తోంది. దేశంలో అన్నాకు సపోర్టు చేసే వారంతా నీతి మంతులు కారు, అన్నాకు సపోర్టు ఇవ్వని వారు అవినీతి పరులు కాదు" సిద్ధార్థ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











