సిద్ధార్థ-హన్సిక ‘సంథింగ్ సంథింగ్’ ఫస్ట్‌లుక్ పిక్చర్స్
హైదరాబాద్: ఓ మై ఫ్రెండ్ చిత్రంలో సిద్ధార్థ-హన్సిక జోడీగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా 'సంథింగ్ సంథింగ్'. ఈచిత్రానికి సుందర్.సి దర్శకుడు. తెలుగునాట లక్ష్మి గణపతి ఫిలింస్ వారు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకున్నారు.
సిద్ధార్థ ఇటీవల నటించిన పలు చిత్రాలు ఒకే సారి తెలుగు, తమిళంలో రూపొందడం చూస్తునే ఉన్నాం. ఇరు ప్రాంతాల్లో సిద్ధార్థ సినిమాలకు మంచి ఆదరణ ఉండటంతో ఇలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 'సంథింగ్ సంథింగ్' చిత్రం తమిళంలో 'తీయ వేలయ్ సెయ్యనుమ్ కొమరు' అనే పేరుతో రూపొందుతోంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నటి ఖుష్బూ నిర్మిస్తుండగా ఆమె భర్త సుందర్ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. జనవరిలో ప్రారంభమైన ఈచిత్రం ఈ సంవత్సరాంతం వరకు థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగు తమిళంలో కొన్ని పాత్రలను మార్పు చేసారు. తమిళ వెర్షన్లో సంతానం కామెడీ పండిస్తాడు. తెలుగులో ఆ పాత్రను బ్రహ్మానందంతో చేయించారు. సాఫ్ట్ వేర్ కంపెనీ బ్యాక్ డ్రాప్‌తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ, హన్సిక సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం:

సంథింగ్ సంథింగ్ లో సిద్ధార్థ-హన్సిక.

గతంలో సిద్ధార్థ-హన్సిక ఓ మై ఫ్రెండ్ చిత్రంలో కలిసి నటించారు.

ఈ చిత్రానకి సుందర్.సి దర్శకుడు. తెలుగునాట లక్ష్మి గణపతి ఫిలింస్ వారు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకున్నారు.

జనవరిలో ప్రారంభమైన ఈచిత్రం ఈ సంవత్సరాంతం వరకు థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.

జనవరిలో ప్రారంభమైన ఈచిత్రం ఈ సంవత్సరాంతం వరకు థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.

తమిళంలో సంతానం, తెలుగులో బ్రహ్మానందం కామెడీ పంచనున్నారు.

సంథింగ్ సంథింగ్ లో సిద్ధార్థ-హన్సిక.

సంథింగ్ సంథింగ్ లో సిద్ధార్థ-హన్సిక.


Click it and Unblock the Notifications











