సిద్ధార్థ-హన్సిక వన్స్ మోర్, కుష్భూ నిర్మాత
హైదరాబాద్: సిద్ధార్థ, హన్సిక దిల్ రాజు నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్' చిత్రంలో జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వీరి కాంబినేషన్ బాగా కుదిరింది. తాజాగా వీరు మరోసారి కలిసి నటించబోతున్నారు. తమిళంలో రూపొందుతున్న 'తీయ వేలై సేయ్యనుమ్ కుమారు' అనే చిత్రంలో కలిసి నటించబోతున్నారు.
సుందర్ సి దర్శకత్వం వహించబోతున్న ఈచిత్రాన్ని కుష్భూ నిర్మించబోతోంది. సిద్ధార్థ, హన్సికలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తమిళంలో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2013 సంవత్సరంలో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
సిద్ధార్థ ప్రస్తుతం నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు చేస్తున్నాడు. బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. దీంతో పాటు ఇంగ్లీష్‌లో 'విండ్స్ ఆఫ్ చేంజ్', ఎన్‌హెచ్2 అనే తమిళ చిత్రంలో, మరో హిందీ చిత్రంలో నటిస్తున్నాడు.
హన్సిక విషయానికొస్తే.... మంచు విష్ణుతో కలిసి హన్సిక నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం విజయదశమికి విడుదలైన సూపర్ హిట్టయింది. మంచు విష్ణు కెరీర్లోనే ఈచిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడంతో పాటు.... ఇండస్ట్రీలో పలు రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











