Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బ్రాండ్స్ విషయంలో నేను ఆయనతో తలపడలేను..!
ట్యిట్టర్లలో ఫాలోవర్స్ కౌంట్ లో నువ్వా నేనా అన్నట్టు మహేష్ బాబుతో తలపడ్డ సిద్ధార్థ త్వరలో మహేష్ బాబుని మరో విధంగా సవాల్ చేయనున్నాడు. సిద్ధార్థ 'పీటర్ ఇంగ్లాండ్ షర్ట్స్' కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇటీనలే 'ప్రోవోగ్ షర్టింగ్స్' కి బ్రాండ్ అంబాసిండర్ గా ఎంపికైన మహేష్ బాబుతో సమరానికి సిద్ధార్థ రడీ అయ్యారని ఫిల్మ్ వర్గాల భోగట్టా. బ్రాండ్స్ విషయంలో టాలీవుడ్ జేమ్స్ బాండ్ మాదిరి దూసుకుపోతున్న ప్రిన్స్ మహేష్ బాబుని కౌంటర్ చేయడానికి మిగిలిన సంస్దలు కూడా పలువురు యంగ్ స్టర్స్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నాయి. ఈ నేపద్యంలో బాలీవుడ్ ని, సౌత్ ఇండియా ఏకకాలంలో టార్గెట్ చేసే వీలుండడంతో సిద్ధార్థ ని పీటర్ ఇంగ్లాండ్ సంస్ద ఎంచుకోవడం జరిగిందని ఆ కంపెని వారు తెలియజేశారు. ఐతే సిద్ధార్థకి మాత్రం ఈ బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం కొత్తేమి కాదు. ఇంతక ముందు సిద్ధార్థ మరియు తమన్నా ఇద్దరు కలసి ఐడియా సెల్యూలర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారించడం తెలిసందే. ఐతే ప్రిన్స్ ముందు సిద్ధార్థ ఎంత వరకు నిలబడగలుగుతాడనేది చూడాలి. అంతేకాకుండా మొన్న మహేష్ తో తాను పోటీకి దిగలేనని, ఆయనకంటే నేను చాలా చిన్నవాడినని వెల్లడించడం మనకి అందరికి తెలిసిందే. పవన్, ఎన్టీఆర్, మహేష్ లాంటి పెద్దవారితో తాను తలపడలేనని సిద్ధార్థ బహిరంగంగా ప్రకటించి తన పరిధిని తాను తెలుసుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ బావ అనే సినిమాలో నటిస్తున్నాడు.