»   » మా వాడు ఇరగదీశాడు: బాహుబలిలో రానా నటనపై వ్యాఖ్య

మా వాడు ఇరగదీశాడు: బాహుబలిలో రానా నటనపై వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రాజమౌళి దర్శకత్వం వహిచంచిన బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో రానా అద్భుతంగా రాణించాడంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా, సిద్ధార్థ్ మల్హోత్రా రానా నటకు ఫిదా అయిపోయాడు. భారత సినీ పరిశ్రమలో బాహుబలి ఓ మైలురాయి అని ఆయన మెచ్చుకున్నాడు. రాజమౌళి సినిమాను అద్భుతంగా తీశారని అన్నాడు.

విలన్ పాత్రలో తన మిత్రుడు దగ్గుబాటి రానా ఇరగదీశాడని ఆయన ప్రశంసించారు. నిన్ను మించిన విలన్ లేడని అన్నాడు. ఈ రోజు బాహుబలి రోజు అంటూ నటుడు ఆశిష్ శర్మ ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. బాహుబలి సినిమాపై బాలీవుడ్ పరిశ్రమ ప్రశంసల జల్లు కురిపిస్తోంది.


Siddharth Malhotra praises Rana in Baahubali

బాలీవుడ్ ప్రముఖులు బాహుబలి సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్లు పోస్తు చేస్తున్నారు. బాహుబలి సినిమా అద్భుతంగా ఉందని నటుడు జాకీ భగ్నానీ ట్వీటే చేసారు. డినో మోరియా, సంజయ్ కపూర్, గౌరీ ఖాన్, తుషార్ కపూర్, విక్రమాదిత్య మోత్వానీ, తదితరులు తొలి రోజే బాహుబలి సినిమాను వీక్షించారు.


దక్షిణాది నటుడు ప్రతాప్ పోతన్ కూడా బాహుబలి సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ అనే పాత సినీ స్టూడియో ఎవిఎం ట్యాగ్‌లైన్ తనకు గుర్తు వస్తోందని ఆయన అన్నారు. రాజమౌళిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

English summary
"As the old avm studios tag line comes into my mind EFFORTS NEVER FAIL" Prathap Pothen says.
Please Wait while comments are loading...