అల్లు అర్జున్ దెబ్బకు వెనక్కి పరుగెడుతున్న సిద్దార్ధ
సిద్దార్థ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 180'ఈ వయసికరాదు' చిత్రం జూన్ 10 వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసారు.అయితే అదే రోజున అల్లు అర్జున్ చిత్రం బద్రీనాధ్ విడుదల చేస్తున్నామని దర్శక,నిర్మాతలు ప్రకటించారు.దాంతో సిద్దార్ధకి అల్లు అర్జున్ తో పోటే పడటం కష్టం అనిపించి చిత్రాన్ని జూన్ 25 కి మార్చినట్లు సమాచారం.ఇక సత్యం సినిమాస్ సమర్పణలో ఎస్‌పిఐ సినిమా ప్రైవేట్‌లిమిటెడ్, అగ్‌హాల్ ఫిలింస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా 180 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయేంద్ర దర్శకుడు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. నిత్యమీనన్, ప్రియాఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కెమేరా: బాలబ్రహ్మన్, మాటలు: ఉమర్జీ కుమరన్, కథ - స్క్రీన్ ప్లే: శుభ, జయేంద్ర, దర్శకత్వం: జయేంద్ర


Click it and Unblock the Notifications











