సిద్దార్ధ అల్లరి కృష్ణుడు లా రొమాన్స్
రొమాంటిక్ హీరో సిద్దార్ధ 'బావ' చిత్రం ఈ నెల 22 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఎమ్.ఎల్.కుమార్‌చౌదరి నిర్మించే ఈ చిత్రం ద్వారా రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాంబాబు గతంలో ప్రభుదేవా, కోడి రామకృష్ణ వద్ద పనిచేసారు. ఇందులో సిద్ధార్థ్ తండ్రిగా ప్రముఖ కథానాయకుడొకరు నటించబోతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ- "అందమైన పల్లె వాతావరణంలో సాగే హృద్యమైన ప్రేమకథ ఇది. ఇందులో హీరో ఓ అల్లరి కృష్ణుడు. ప్రేమ భావనలు, కుటుంబ విలువలతో మిళితమైన పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. ప్రతి ఫ్రేమూ ఓ పెయింటింగ్‌లా ఉంటుంది' అని చెప్పారు.
నిర్మాత కుమార్‌చౌదరి మాట్లాడుతూ కథ, కథనాలు ఎంతో బాగున్నాయి. ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా ద్వారా ఓ నూతన నటిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామన్నారు. సిద్దార్ధ ప్రస్తుతం దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆర్.కె బ్యానర్ లో ఆయన కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రంలో సిద్దార్ధ నటిస్తున్నారు. ఆయనకు జోడిగా శ్రుతి కమల్ హాసన్ నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా నడిచే ఈ చిత్రం బావ, మరదళ్ళ అనుభంధం చిత్రీకరిస్తుందా లేక మేనత్త కొడుకైన బావతో అనుబంధాన్ని వివరిస్తుందా చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి సమర్పణ: సందీప్, మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: అరవింద్ కృష్ణ, కూర్పు: గౌతమ్‌రాజు.


Click it and Unblock the Notifications