సిద్దార్ద, దిల్ రాజు కాంబినేషన్ చిత్రం టైటిల్ ఇదే
సిద్దార్ధ, దిల్ రాజు నిర్మాతగా సిద్దార్ద హీరోగా నిర్మితమయ్యే చిత్రానికి "ఓహ్..మై ప్రెండ్" అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ అనే దర్శకుడుని పరిచయం చేయనున్నారు. బొమ్మరిల్లు తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. అయితే బావ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు అలుముకుంటున్న సమయంలో ఈ టైటిల్ వెలుగులోకి వచ్చింది కాబట్టి ప్రాజెక్టుకి ఏ ప్లాబ్లం లేదని చెప్తున్నారు. అలాగే నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. ఈ చిత్రంపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నట్లు..ఓ ప్రెష్ ధాట్ తో చిత్రం చేయనున్నట్లు దిల్ రాజు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక సిద్దార్ధ ప్రస్తుతం రాఘవేంద్రరావు కుమారుడు కె.ప్రకాశరావు దర్శకత్వంలో రెడీ అవుతున్న ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











