సిద్దార్ధ, దిల్ రాజుల చిత్రం ప్రారంభం ఎప్పుడంటే...
దిల్ రాజు నిర్మాతగా సిద్దార్ధ హీరోగా రూపొందే ఓ మై ప్రెండ్ చిత్రం పిబ్రవరి 21వ తేదీ నుండి ప్రారంభం కానుంది. కరీంనగర్ కి చెందిన వేణు శ్రీరామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ గా ఓహ్ మై ప్రెండ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల,వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన రితు చిత్రం సంగీతం విని ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది.
More from Filmibeat
సిద్ధార్థ దిల్ రాజు బొమ్మరిల్లు కె ప్రకాశరావు రాఘవేంద్రరావు భాస్కర్ siddharth dil raju bommarillu shruti hassan bava


Click it and Unblock the Notifications











