twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్నేహం.. ప్రేమ కన్ఫూజన్ (ఓహ్ మై ప్రెండ్ ప్రివ్యూ)

    By Srikanya
    |

    ఆడ, మొగ ఎప్పటికీ కేవలం స్నేహితులుగా ఉండిపోగలరా, వారి స్నేహం ప్రేమగానో, మరో విదంగానో రూపం తీసుకోదా అనే పాయింటుతో వచ్చిన చిత్రం ఓహ్ మై ప్రెండ్. చిత్రంలో చందు (సిద్ధార్థ్‌)గిటారిస్ట్‌, సిరి (శృతి హాసన్‌)క్లోజ్ ప్రెండ్స్. అందురూ వీరి స్నేహాన్ని చూసి ప్రేమ అని అపార్ధం చేసుకుంటూంటారు. సిరి భరత నాట్యం నేర్పిస్తుంటుంది. ఈ లోగా రీతు (హన్సిక)చందుతో జీవితంలో ప్రవేశిస్తుంది. కొద్ది పరిచయంలోనే చందు ఆమెతో ప్రేమలో పడిపోతాడు. మరో ప్రక్క ఉదయ్‌ (నవదీప్‌)తో సిరికి ఎంగేజ్ మెంట్ అవుతుంది. ఇక మిగతా కథ చందు, సిరిల స్నేహం చుట్టూ తిరుగుతుంది. అది వారనుకున్నట్లు స్నేహమేనా, లేక ప్రేమా అనే పాయింటుతో కథ నడుస్తూంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఓ సీన్ హైలెట్ గా ఉంటుంది. అదే వారు అస్సలు వారి మనస్సులో ఏముందనే విషయాన్ని తేల్చి చెప్తుంది.

    ఈ చిత్రం గురించి నిర్మాత రాజు మాట్లాడుతూ.. స్నేహం, ప్రేమ కలబోతగా సాగే చిత్రమిది.చాలామందికి ప్రేమ, స్నేహం మధ్య ఉన్న సన్నని అంతరం తెలియదు. ఈ తరానికి కాకపోయినా రాబోయే తరం వారికైనా ప్రేమ, స్నేహంపై అవగాహన కలిగించేలా ఈ చిత్రం ఉంటుంది. పెద్దవాళ్లనీ ఆలోచింపజేసే చిత్రమిది. ముగింపు సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ "ఇలాంటి సినిమా దిల్ రాజుగారు మాత్రమే తియ్యగలరు. స్వతహాగా మంచి ఆర్టిస్టు అయిన సిద్ధార్థ్ ఎంతో ఎఫర్ట్‌పెట్టి నటించాడు. శృతి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆమెలో ఓ కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు''అని చెప్పారు.

    సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
    నటీనటులు: సిద్ధార్థ్‌, శృతి హాసన్‌, హన్సిక, నవదీప్‌, తనికెళ్ల భరణి, రఘుబాబు, అలీ, లక్ష్మీ రామకృష్ణన్‌, వినయప్రసాద్‌ తదితరులు.
    పాటలు: సీతారామశాస్త్రి,కృష్ణచైతన్య
    ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి
    డాన్స్: రాజు సుందరం, దినేశ్, రఘు, సుచిత్ర
    కళ: ఎస్. రవీందర్
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వేణు శ్రీరామ్
    లైన్ ప్రొడ్యూసర్: అశోక్
    నిర్మాత: దిల్‌ రాజు
    విడుదల: శుక్రవారం.

    English summary
    “Discover the secret of lasting friendships and true love through oh My friend film,” producer 'Dil' Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X