twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్ధార్థ్‌ 'ఓయ్‌' రేపే

    By Staff
    |

    'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అన్న సిద్దార్ధ ఈ సారి 'ఓయ్' అంటూ రేపే మన ముందుకు రానున్నాడు. యూనివర్శల్ మీడియా బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా ఆనంద్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. అంజలి పాప షామిలి హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తోంది. మణిరత్నం 'అంజలి' చిత్రంలో జుట్టు విరబోసుకుని ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకునే బేబి షామిలీ ఈ చిత్రంతోనే హీరోయిన్ గా ప్రమోషన్ పొందుతోంది. షామిలీ ని చాలా కాలం నుండి పెద్ద పెద్ద దర్శకులు సైతం హీరోయిన్ గా తమ సినిమాల్లో అడిగారుట. అయితే ఆమె ఎప్పుడూ ఒప్పుకోలేదు.

    అయితే ఇన్నాళ్ళుకు ఒప్పుకోవటానికి కారణం ఆమె సిద్దార్దకి వీర ఫ్యాన్ కావటమే కారణమని చెప్తున్నారు. ఇక "ఓయ్" చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు..విశాఖకు 20 కి.మీలలో గల రుషి కొండలో 20 లక్షల సెట్‌వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పొయిటిక్ టచ్ తో నడిచే కథనంతో సెంటిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. రెండు పాటలు, పదిరోజులు టాకీ పార్టీ మినహా సినిమా పూర్తయ్యింది. అలాగే ఈ చిత్రానికి ఊహించని క్లైమాక్స్ ఉంటుందని, అది ధియోటర్ నుంచి బయిటకు వచ్చినా వెంబడిస్తుందని దర్శక, నిర్మాతలు ధీమాగా ఉన్నారు.సిద్ధార్థ్‌, దర్శకుడు ఆనంద్‌ రంగా ప్రచార వ్యూహంలో భాగంగా ఆమె ఫొటోని బయటకు పొక్కనీయలేదు. అడపాదడపా వచ్చిన పోస్టర్లలో కూడా షామిలి ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు షామిలి ఛాయాచిత్రాలు బయటకొచ్చాయి. వాటిలోనిదే ఇక్కడ ప్రచురించిన ఫొటో. 1990లో 'అంజలి' ద్వారా కెమెరా ముందుకొచ్చిన షామిలి-ఆ తరవాత తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా నటించింది. చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోక సుందరి'లో షామిలి చేసిన నటన తెలుగువారిని ఆకట్టుకొంది. రాజీవ్‌ మీనన్‌ సినిమా 'కండు కొండేన్‌ కండు కొండేన్‌' (తెలుగులో 'ప్రియురాలు పిలిచింది') తరవాత షామిలి చదువుకే అంకితమైంది. నాయికగా 'ఓయ్‌'తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X