twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి రుజువైంది.. అనుకొన్నదే జరిగింది.. తెలుగు ప్రేక్షకులపై సిద్ధార్థ్ కామెంట్స్

    By Rajababu
    |

    మంచి కథ, టేకింగ్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పుకుండా ఆదరిస్తారనే విషయం గృహం చిత్రంతో మరోసారి రుజువు అయింది అని హీరో సిద్ధార్థ్ అన్నారు. తెలుగు, తమిళం, హిందీలో రిలీజైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తున్నది. ఈ చిత్రాన్ని ఘనవిజయం చేసిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్, ఆండ్రియా జెర్మియా నటించిన గృహం చిత్రం నవంబర్ 17న రిలీజై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే.

     హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా

    హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా

    హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా గృహం చిత్రం రూపొందింది. మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన హారర్, థ్రిల్లర్ చిత్రంలో సీనియర్ నటులు సురేశ్, అతుల్ కులకర్ణి, అనీషా విక్టర్ తదితరులు నటించారు. శ్రేయాస్ కృష్ణ అందించిన సినిమాటోగ్రఫి, గిరీష్ మ్యూజిక్‌కు అనూహ్య స్పందన వస్తున్నది.

     గృహంపై క్రిటిక్స్ ప్రశంసలు

    గృహంపై క్రిటిక్స్ ప్రశంసలు

    గృహం చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి నిర్మాతగా సిద్ధార్థ్ నిర్మించాడు. ఈ చిత్రంలోని నటీనటుల యాక్టింగ్‌కు, సాంకేతిక నిపుణుల పనితీరుపై ప్రేక్షకులు, సిని విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

     గృహంతో కొత్త అనుభూతి

    గృహంతో కొత్త అనుభూతి

    గృహం సక్సెస్ బాటలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో వయాకామ్ 18 ప్రతినిథులు, సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడారు. పక్కా హారర్ సినిమా తెలుగు తెరకు తాకి చాలా రోజులైంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మేము పడిన కష్టానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో చాలా సంతోషం కలుగుతున్నది అని వయాకామ్ ప్రతినిథులు అన్నారు.

     చిన్నపిల్లలకు చూపించొద్దు

    చిన్నపిల్లలకు చూపించొద్దు

    మూడు భాషల్లోనే సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. సినిమాను చూసిన ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలవుతున్నారు. ఇది పక్కా హారర్ చిత్రం. ఈ చిత్రాన్ని చిన్నపిల్లలతో కలిసి చూడకూడదు అని సిద్ధార్థ్ సూచించాడు. ఇది ఫ్యామిలీ అంతా చూడాల్సిన చిత్రం కాదు.. హారర్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల కోసం మాత్రమే రూపొందించబడినది అని ఆయన తెలిపారు.

    English summary
    Hero Siddharth played lead role alongside Andrea Jeremiah in a horror film Gruham released on November 17th and he also co-produced it in association with Viacom 18 Motion Pictures and Etaki Entertainment. Gruham is not simply another horror film, but it is on par with Hollywood standards. Siddharth, Andrea, Anisha Victor, Atul Kulkarni and Suresh’s exceptional performance and Girish’s enchanting background score are major highlights of the film. While speaking on the occasion, Siddharth said, “It is once again proved that, Telugu spectators will always encourage films with potential content. I thank one and all for making Gruham that was released in Telugu, Tamil and Hindi languages a super hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X