ఘనంగా నటి జయప్రద కుమారుడి వివాహం (ఫోటోస్)
హైదరాబాద్: సినీ నటి జయప్రద కుమారుడు సిద్ధార్థ వివాహం ప్రవళ్లిక రెడ్డితో ఎల్‌బీనగర్‌లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతన్ని చిన్నతనంలోనే దత్తత తీసుకుంది. జయప్రద వారసత్వంతో సిద్ధార్థ్ కూడా సినిమాల్లో నటించాడు. తమిళంలో ‘ఉయిరే ఉయిరే' అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటించింది. స్లైడ్ షోలో సిద్ధార్థ్, ప్రవళ్లిక రెడ్డిల వివాహ వేడుక ఫోటోస్..

సిద్దార్థ్-ప్రవళ్లిక
సిద్ధార్థ వివాహం ప్రవళ్లిక రెడ్డితో ఎల్‌బీనగర్‌లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం గ్రాండ్‌గా జరిగింది.

అలనాటి హీరోయిన్లు
పెళ్లి వేడుకలో అలనాటి హీరోయిన్లు జయప్రద, రాధిక, జయసుధ.

భర్తతో జయసుధ
సహనటి రాధిక, భర్త నితిన్ కపూర్ తో కలిసి నటి జయసుద.

ఎంగేజ్మెంట్
సిద్ధార్థ, ప్రవళ్లిక రెడ్డి ఎంగేజ్మెంట్ నాటి ఫోటో...

డాన్స్..
ఇటీవల జరిగిన సంగీత్ కార్యక్రమంలో జయసుధ, జయప్రద డాన్స్


Click it and Unblock the Notifications











