ప్రభాస్ కి ఇంటి నుంచే పోటీ
ప్రభాస్ కి ఇప్పుడు తన స్వంత కుటుంబం నుంచే పోటీ మొదలైంది. అతని కజిన్ సిద్దార్ధ రాజ్ హీరోగా పరిచయం అవుతూ "కెరటం" చిత్రం నిర్మితమై రిలీజుకు రెడి అయింది. పోస్టర్స్, ఫస్ట్ లుక్ స్టిల్స్ చూసిన వారు మంచి భవిష్యత్ ఉందని అంటున్నారు. ఇక యస్.వి.ప్రొడక్షన్స్ పతాకంపై, సిద్ధార్థ్ రాజ్ కుమార్ హీరోగా, రాకుల్ ప్రీత్ హీరోయిన్ గా, గౌతం పట్నాయక్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ, కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత అయిన యస్.వి.బాబు ఈ త్రిభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్యాప్షన్ గా "ది వే ఆఫ్ యూత్" అని నిర్ణయించారు. ఈ చిత్ర దర్శకుడు గౌతం పట్నాయక్ గతంలో "వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి" వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ "కెరటం చిత్రానికి జోష్వా శ్రీధర్ సంగీతాన్ని అందిస్తున్నారు. "కెరటం" అనే ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాని కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











