twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు నీదు కాదు రాయుడు.. ఎన్ని కష్టాలు పడ్డాడో.. సిద్ధార్థ్ ఫైర్

    |

    Recommended Video

    Hero Siddharth Backs Ambati Rayudu & Fires On BCCI || Filmibeat Telugu

    టీమిండియా బ్యాట్స్‌మన్, హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తన రిటైర్‌మెంట్ పట్ల సంచలన నిర్ణయం తీసుకొని క్రీడాభిమానులు ఆశ్చర్యపరిచాడు. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన ఆయన ఐపీఎల్ మాత్రం ఆడతానని అన్నారు. అయితే అమ్బటి రాయుడు తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ప్రపంచకప్‌ క్రికెట్ టోర్నీకి సెలెక్ట్ కాకపోవడమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడుకి మద్దతుగా నిలిచారు హీరో సిద్దార్థ్. వివరాల్లోకి పోతే..

    రెండోసారీ కూడా నిరాశే.. మనస్థాపం చెంది

    రెండోసారీ కూడా నిరాశే.. మనస్థాపం చెంది

    రాయుడుకు బదులు ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించుకున్న ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినా.. అతడి స్థానంలో యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో రెండోసారీ కూడా రాయుడికి నిరాశే ఎదురైంది. అవకాశం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    అంబటి రాయుడు తప్పు లేదు

    అంబటి రాయుడు తప్పు లేదు

    ఈ నేపథ్యంలో రాయుడి సంచలన ప్రకటనపై స్పందించిన సిద్దార్థ్.. ''భారత దేశవాళీ క్రికెట్‌ను గమనించేవారికి ఎవరికైనా అంబటి రాయుడి కెరీర్‌లో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడో తెలుస్తుంది. అతనో అద్భుతమైన ఆటగాడు. అతని అంతర్జాతీయ కెరీర్ మరింత ఉజ్వలంగా సాగి ఉండాల్సింది కానీ అలా జరగలేదు. ఇది నీ తప్పు కాదు రాయుడు. నీ భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నా'' అని ట్వీట్ చేశాడు.

    బీసీసీఐ వ్యవహార శైలిపై సిద్దార్థ్ ఫైర్

    బీసీసీఐ వ్యవహార శైలిపై సిద్దార్థ్ ఫైర్

    బీసీసీఐ వ్యవహార శైలిపై మండిపడుతూ మరో ట్వీట్ చేశారు హీరో సిద్దార్థ్. ఈ ట్వీట్ ద్వారా.. '' ఈరోజు ఐపీఎల్ పునాది అయిన ఐసీఎల్ గుర్తొస్తోంది. ఓ లెజండ్ ఆటగాడిని అనుసరించి యువ క్రికెటర్లు అంతా అందులో అడుగుపెట్టారు. అప్పుడే బీసీసీఐ అన్యాయంగా ఆ లీగ్ ను మూసివేయించింది. దీంతో వందలాది మంది నైపుణ్యమున్న యువ క్రికెటర్లను తమ భవిష్యత్ కోసం పోరాడేలా చేసింది'' అని భారత క్రికెట్ బోర్డుకు చురకలంటించారు సిద్దార్థ్.

    రాయుడు కెరీర్ విషయాలు

    రాయుడు కెరీర్ విషయాలు

    2013లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రాయుడు అరంగేట్రం చేసాడు. ఈ ఏడాది రాంచీలో ఆస్ట్రేలియాపై చివరి వన్డే ఆడాడు. 55 వన్డేల్లో రాయుడు 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 124 నాటౌట్. భారత పరిమిత ఓవర్ల జట్లలో కీలక ఆటగాడిగా ఉన్న రాయుడు ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆడలేదు.

    ఐపీఎల్‌లో అంబటి రాయుడు

    ఐపీఎల్‌లో అంబటి రాయుడు

    రాయుడు ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌ల్లో 3,300 పరుగులు చేశాడు. చివరిగా ఐపీఎల్‌ -2019లో చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున 17 మ్యాచులు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు. మొత్తం 216 టీ20లలో 4584 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

    సుదీర్ఘ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌.. హైదరాబాద్‌ కెప్టెన్‌

    సుదీర్ఘ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌.. హైదరాబాద్‌ కెప్టెన్‌

    రాయుడు తన 17 సంవత్సరాల సుదీర్ఘ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో 97 మ్యాచ్‌లాడి 6151 పరుగులు చేశాడు. దాంట్లో 16 సెంచరీలతో పాటు 34 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 210. హైదరాబాద్ తరఫున 2002లో రంజీల్లోకి అరంగేట్రం చేసిన రాయుడు.. ఆ తర్వాత రెండు జట్లు మారాడు. హైదరాబాద్‌ రంజీ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించి క్రేజ్ కొట్టేశాడు.

    English summary
    India middle-order batsman Ambati Rayudu has announced his retirement from all forms of cricket, including the IPL. The move comes after Rayudu was snubbed by the Indian team management who preferred Mayank Agarwal as replacement for an injured Vijay Shankar in the World Cup squad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X