For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత తో పెళ్లి గురించేనా సిద్దార్ద చెప్పింది?

  By Srikanya
  |

  హైదరాబాద్‌ : సిద్దార్ధ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పిల్లలు, కుటుంబం కావాలని కోరుకుంటున్నానని, తనకల త్వరలో వాస్తవ రూపు దాల్చబోతోందని చెప్పుకొచ్చాడు. దాంతో అందరి దృష్టీ సమంత పై మళ్లింది.

  ఇక ఇప్పటికే ... పలువురు హీరోయిన్‌లను తనతో ముడిపెట్టి మీడియా రాసిందని, అయితే వాటన్నింటికీ ప్రతిస్పందించగూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఇలాంటి వార్తలను పట్టించుకోరని తెలిపారు. అయితే సిద్దార్ధ ఖచ్చితంగా సమంతనే పెళ్ళి చేసుకోబోతున్నట్లు ఫిలిమ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. దానికితోడు వారిద్దరూ ఇటీవల శ్రీకాళహస్తి దేవాలయానికి కలిసివెళ్ళి రాహుకేతు పూజ చేయించడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయింది.

  వీళ్ళిద్దరూ కలిసి ఇటీవల జబర్దస్త్‌ అనే సినిమాలో హీరో హీరోయిన్‌లుగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్యనా సమ్ థింగ్..సమ్ థింగ్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే సిద్దార్ధ సమంత మెళ్ళో తాళికట్టేరోజు దగ్గరలోనే ఉందని అందరూ అంటున్నారు.

  వీరి వివాహ వార్తపై మరింత సమాచారం..స్లైడ్ షో లో...

  ఇప్పటికే ఒక పెళ్ళి అయి విడాకులు తీసుకున్న సిద్దార్ధ తమిళనాడుకు చెందిన హిందూ కాగా, సమంత కేరళకు చెందిన క్రిస్టియన్‌.

  సిద్దార్ధ కొంతకాలంక్రితం కమలహాసన్‌ కుమార్తె శృతిహాసన్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఏమయిందో, ఏమోగానీ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు.

  హిందీలో 'రంగ్ దే బసంతి' చేసే కాలంలో సైఫ్ అలీఖాన్ చెల్లెలు సోహా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. తెలుగులో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా చేసేప్పుడు ఆ సినిమా హీరోయిన్ తమన్నాకీ, ఆయనకీ మధ్య 'సమ్‌థింగ్' నడుస్తోందంటూ ఊహాగానాలు చెలరేగాయి. ఆపైన 'అనగనగా ఓ ధీరుడు' చేసేటప్పుడు ఆ చిత్ర కథానాయకి శ్రుతి హాసన్‌తో ఆయన ప్రేమాయణం నడుపుతున్నాడంటూ గోలపుట్టింది.

  ఈసారి మరింత బలంగా నేటి సంచలన తార సమంతతో సిద్ధార్థ్ పేరును ముడిపెడుతూ కొంత కాలంగా మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ ఇద్దరూ కలిసి 'జబర్దస్త్' సినిమా చేశారు. అప్పట్నించే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ ప్రచారంలోకి వచ్చింది.

  సమంతతో అనుబంధం గురించి అడిగినప్పుడు సిద్ధార్థ్ ఖండించనూ లేదు, అలాగని ఒప్పుకోనూ లేదు. తన పెళ్లి విషయం తన తల్లిదండ్రులే చూసుకుంటారని చెప్పాడు. ఇటీవల శ్రీకాళహస్తికి సిద్ధార్థ్, సమంత ఏక కాలంలో తమ కుటుంబాలతో కలిసి వెళ్లి కలిసే సర్పదోష నివారణ పూజలు చేయడంతో వారి పెళ్లి ఖాయమంటూ కథనాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లికి సిద్ధంగా ఉన్నానని సిద్ధార్థ్ తెలపడంతో ఆ రోజు అతి చేరువలో ఉన్నదనే సంకేతం ఇచ్చినట్లయింది.

  English summary
  "I am ready for it. I hope to have a family with children and am hoping it happens soon. I have been written about with a lot of women. I have chosen not to respond. My family does not read gossip rags and what is in the paper today is the packing for a pakoda tomorrow," the Times of India quoted the actor as saying. But the rumours on Siddharth and Samantha are getting stronger by each day. How? Find out on the slideshow...
 Siddharth And Samantha
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X