హీరో రియల్ లవ్ స్టోరీనే దిల్ రాజు...
దిల్ రాజు తాజా చిత్రం 'ఓ మై ఫ్రెండ్' ఇప్పుడు హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే ఈ చిత్రం ప్రారంభం కావటానికి కారణం..సిద్దార్ధ,శృతి హాసన్ ల లవ్ స్టోరీని దృష్టిలో పెిట్టుకుని కథ తయారు చేయటమేనని చెప్తున్నారు. అదే రేపు పేయింగ్ ఎలిమెంట్ గా దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా కాలంగా సిద్దార్ధ, శృతిహాసన్ సహ జీవనం చేయటం ..దిల్ రాజు ని ఆకర్షించి ఆ పెయిర్ తో సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నాడుట. సల్మాన్,కత్రినా కైఫ్ కాంబినేషన్ సినిమాలకు ప్రేక్షకులకు ఉండే క్రేజ్ గమనించే ఈ ప్లాన్ చేసాడని చెప్పుకుంటున్నారు. ఇక సిద్ధార్థ్, శ్రుతిహాసన్, హన్సిక, నవదీప్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు.
షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. నేడు యువతలో ఉన్న కన్‌ఫ్యూజన్స్, ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలన్నీ కలగలిపి వేణు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత మా సంస్థలో సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ఇది. అతను మంచి నటుడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంలో ఎక్కువ భాగం శ్రుతిహాసన్ కొట్టేస్తుంది అంటున్నారు దిల్ రాజు. దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ "ఇలాంటి సినిమా దిల్ రాజుగారు మాత్రమే తియ్యగలరు. స్వతహాగా మంచి ఆర్టిస్టు అయిన సిద్ధార్థ్ ఎంతో ఎఫర్ట్‌పెట్టి నటించాడు. శ్రుతి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆమెలో ఓ కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు'' అని చెప్పారు. అలీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, లక్ష్మీ రామకృష్ణన్, వినయ ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, కృష్ణచైతన్య, ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, డాన్స్: రాజు సుందరం, దినేశ్, రఘు, సుచిత్ర, కళ: ఎస్. రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వేణు శ్రీరామ్.


Click it and Unblock the Notifications











