బెంగుళూరులో సిద్ధార్థ అమల పాల్ రొమాన్స్!

By Bojja Kumar

వరుస సినిమాలతో హీరోయిన్ అమలపాల్ మంచి జోరు మీదుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హీరో సిద్దార్థతో బెంగులూరులో రొమాన్స్ చేస్తోంది. సిద్దార్థ, అమలపాల్ జంటగా రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగుళూరు పరిసరాల్లో జరుగుతోంది. ఇందులో భాగంగా ఇద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఒకే సారి తెలుగు, తమిళంలో రిలీజ్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ కు 'కధలిల్ సోధపువదు ఎప్పడి" అనే పేరును ఖరారు చేశారు. అయితే తెలుగు వర్షన్ కు టైటిల్ ఖరారు కావాల్సి ఉంది.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షెడ్యూల్ బెంగుళూరు అర్భన్ ఏరియాలో జరుగుతోంది. బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'వైనాట్ స్టూడియోస్" ప్రొడ్యూస్ చేస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. నిరావ్ షా ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు.

ఇక పోతే సిద్ధార్థ తాజా సినిమా ఓ మై ఫ్రెండ్ ఈ రోజు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. శృతిహాసన్, హన్సిక ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నఈ సినిమాలో సిద్ధార్థ, శృతిహాసన్ తమ మధ్య ఉన్నది ప్రేమా? స్నేహమా? తేల్చుకోలేని పాత్రలో కనిపించగా, హన్సిక సిద్ధార్థ ప్రియురాలిగా నటించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో మరో రెండు రోజుల్లో తేల నుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X