twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదో పెద్ద సమస్యగా మారింది: సిద్ధార్థ్ ‘గృహం’ కష్టాలు

    సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘గృహం’ మూవీ మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రం నవంబర్ 10న విడుదలవ్వాల్సి ఉండగా, నవంబర్ 17కు వాయిదా వేశారు.

    By Bojja Kumar
    |

    తెలుగులో విడుదలవుతున్న డబ్బింగ్ సినిమాల పట్ల రిజనల్ సెన్సార్ బోర్డు అనుసరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. సెన్సార్ బోర్డు ఆయా సినిమాలకు సరైన సమయంలో సర్టిఫికెట్ జారీ చేయక పోవడం వల్ల సినిమాలు వాయిదా వేసుకు పరిస్థితి ఏర్పడుతోందట.

    ఇటీవల విజయ్ నటించిన తమిళ మూవీ 'మెర్సల్' తెలుగు వెర్షన్ విషయంలో ఇలాంటి సమస్యే ఏర్పడింది. తాజాగా సిద్దార్థ్ నటించిన 'అవల్' మూవీ తెలుగు వెర్షన్ విషయంలో కూడా సెన్సార్ సమస్య రావడంతో సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

    వాయిదా మీద వాయిదా

    వాయిదా మీద వాయిదా

    సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన తమిళ హారర్ థ్రిల్లర్ ‘అవల్' తెలుగులో ‘గృహం' పేరుతో రిలీజ్ కావాల్సి ఉంది. తెలుగు, తమిళంలో ఈ చిత్రం ఒకేసారి నవంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా తెలుగు సెన్సార్ పూర్తికాక పోవడంతో సినిమా నవంబర్ 10కి వాయిదా పడింది. సెన్సార్ బోర్డు ఆలస్యం కారణంగా సినిమా వాయిదా పడటం, ఇపుడు(నవంబర్ 10)న థియేటర్ల సమస్య రావడంతో ఈ చిత్రాన్ని నవంబర్ 17కు వాయిదా వేశారు.

    ఇంట్రస్ట్ చచ్చిపోతుంది

    ఇంట్రస్ట్ చచ్చిపోతుంది

    తమిళంలో విడుదలైన ‘అవల్' చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. రివ్యూలు కూడా అనుకూలంగా వచ్చాయి. ఈనేపథ్యంలో సినిమా కోసం తెలుగు ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా మళ్లీ వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇలా అయితే సినిమాపై ఇంట్రస్ట్ చచ్చిపోతుందనే అభిప్రాయాలు వ్యక్త అవుతున్నాయి.

    ఆలస్యంతో పైరసీ ముప్పు ఎక్కువే

    ఆలస్యంతో పైరసీ ముప్పు ఎక్కువే

    ఈరోజుల్లో సినిమా విడుదలైన మరుసటిరోజే పైరసీ దర్శనమిస్తోంది. ఇలా సినిమా ఒక వెర్షన్లో విడుదలై, మరో వెర్షన్లో కాక పోవడం వల్ల పైరసీ ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది సినిమాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

    గృహం

    గృహం

    సిద్ధార్థ్, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన హరర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘గృహం' . మిలింద్ రావు దర్శకత్వం వహించిన ‘గృహం' ఈమూవీకి సిద్దార్థ్ స్క్రీన్ ప్లే, కథ సహకారం అందించడం విశేషం. ఈ చిత్ర కథ మొత్తం ఆత్మల చుట్టూ తిరుగుతుంది. జెన్నీ అనే అమ్మాయి గత జన్మకి ఈ జన్మకి మధ్య సంఘర్షణే చిత్ర కథాంశంగా తెలుస్తోంది.

    English summary
    Siddharth had actually planned to release "Gruham" and "Aval" (film's Tamil version) on the same date, November 3. Failure in procuring censor certificate in time forced him to postpone the release of Telugu version by a week, and Nov 10 was announced as the new release date. With less than 48 hours for the release, Siddharth has now informed with a pained heart that "Gruham" will 'hopefully' hit screens next week, on Nov 17, as he couldn't get the censor certificate yet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X