సిద్దార్ధ 'బావ' అయ్యే రోజు దగ్గరపడింది
యూత్ లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్దార్ధ తాజాగా ఓ కొత్త చిత్రానికి కమిటయ్యారు. రాంబాబు అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. అతను గతంలో ప్రభుదేవా,కోడి రామకృష్ణ వద్ద పనిచేసారు. ఇక ఈ చిత్రాన్ని కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎమ్.ఎల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి బావ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. జనవరి ఇరవై నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రం కోసం పరిశ్రమలో పేరున్న టెక్నీషన్స్ చాలామంది ఈ చిత్రానికి పనిచేయనున్నట్లు సమాచారం.
ఓయ్ చిత్రం అనంతరం ఈ చిత్రం కథ బాగా నచ్చి సిద్దార్ధ వెంటనే డేట్స్ ఇఛ్చాడని ఓ రెండు హిందీ సినిమాలను కూడా దీనికోసం వదులుకోనున్నట్లు చెపుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా నడిచే ఈ చిత్రం బావ,మరదళ్ళ అనుభంధం చిత్రీకరిస్తుందా లేక మేనత్త కొడుకైన బావతో అనుబంధాన్ని వివరిస్తుందా చూడాల్సిందే. ఇక సిద్దార్ధ ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు బ్యానర్ లో ఆయన కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రంలో సిద్దార్ధ నటిస్తున్నారు. ఆయనకు జోడిగా శ్రుతి కమల్ హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రస్ లో ఉండగానే మరో కొత్త చిత్రానికి సిద్దార్ధ కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











