'మగధీర' మోజులో పడే సిద్దార్ధ ఆ టైటిల్ ఓకే చేసాడా?
సిద్ధార్థ, శృతి హాసన్ జంటగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఓ పాంటసీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఏ టైటిలూ ఇప్పటివరకూ ఫైనల్ చేయలేదు. వన్స అపాన్ ఎ టియర్ అనీ, యోధ అని రకరకాల టైటిల్స్ వినపడుతున్నాయి. అయితే ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి 'అనగనగా ఒక ధీరుడు' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. రామ్ చరణ్ కెరీర్ లో సంచలన విజయం సాధించిన మగధీర ప్రేరణతో పెట్టారో మరేమో గానీ ఈ టైటిల్ అన్ని వర్గాలు వారు అదరిస్తారని ఆశిస్తున్నారు. అలాగే ఈ టైటిల్ విని సిద్దార్ధ చాలా బాగా ఇంప్రెస్ అయినట్లు సమాచారం. ఈ మేరకు..ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ని రిజస్టర్ కూడా చేసారు. ఇక ఈ చిత్రం కథ..అంగరాజ్యంలో కన్నీటు బొట్టు ఆకారంలో ఉండే ఓ కాల్పనిక గ్రామంలో ఈ జానపద కథ జరుగుతుంది. క్షుద్రశక్తులతో అంగరాజ్యాన్ని నాశనం చేయాలని రాక్షస మహారాణి అనుకుంటుంది. ఆమె బారిన పడిన తొమ్మిదేళ్ళ పాపను కాపాడటానికి ఒక వీరుడు బయలుదేరతాడు. అతడి ప్రేయసి జిప్పీ వనిత. ఆఖరి పోరాటంలో విజయం ఎవరిని వరించిందన్న దిశలో కథనం నడుస్తుంది. కె.రాఘవేంద్రరావు సమర్పణలో వాల్ట్ డిస్నీ (ఇండియా) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఒక రాక్షస మహారాణి పాత్రలో నటిస్తోంది. 2009లో ఈ భారీ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2011 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











