2012 లో సిద్దార్ధ వి ఐదు రిలీజ్ లు
వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న సిద్దార్ధకి సినిమాలు మాత్రం గ్యాప్ రాకుండా విడుదల అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా సిద్దార్ద నటించిన ఐదు చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిల్లో మొదట తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రం విడుదల అవుతుంది. ఆ తర్వాత దీపా మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న మిడ్ నైట్ చిల్ట్రన్ చిత్రం వస్తుంది. ఇక ఈ రెండు చిత్రాల అనంతరం హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విడుదల అవనుంది.
ఇవన్నీ వేరే భాషల్లో రెడీ అవుతున్న చిత్రాలు. తెలుగు విషయానికి వస్తే పిల్ల జమీందార్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో రూపొందనున్న సుకుమారుడు చిత్రం,నందీనీ రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రాలు విడుదల అవుతాయి. ఇవన్నీ కాక మరో మూడు చిత్రాలు ఈ సంవత్సరం ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇక సిద్దార్ద ఈ మధ్య కాలంలో బావ,180,ఓ హ్ మై ప్రెండ్ చిత్రాలతో నిరాశపరిచాడు. అయినా అతనిపై నిర్మాత,దర్శకులుకు నమ్మకాలు మాత్రం తగ్గలేదు. అతనికి పోటీగా ఎదుగుతాడు అనుకున్న వరుణ్ సందేశ్ సైతం డల్ అవ్వటంతో మళ్లీ సిద్దార్ధ హవా ప్రారంభమయ్యింది.


Click it and Unblock the Notifications











