గుట్టు రట్టు : సమంత-సిద్ధార్థ పెళ్లి ఫిక్స్.. తిరుపతిలో!
హైదరాబాద్: సౌతిండియా సినీ స్టార్స్ సమంత, సిద్ధార్థ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొంత కాలంగా సీక్కెట్ ఎఫైర్ సాగిస్తున్న వీరిద్దరు త్వరలో ఓ ఇంటి వారు కాబోతున్నారు. వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లుగా ఇంత కాలంగా వార్తలు వస్తున్నా... తమది స్నేహం మాత్రమే అని ఖండిస్తూ వచ్చిన వీరిద్దరు తాజాగా తమ రహస్య ప్రేమాయణం గురించి, పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్లో వీరి వివాహం జరుగనుంది.
గడిచిన వీకెండ్‌లో ముంబైలోని హోటల్‌లో సమంత, సిద్ధార్థ గడిపారు. ఈ సందర్భంగా అక్కడ తాకప నడిర వన్ ఇండియా రిపోర్టర్‌తో సమంత మాట్లాడుతూ తమ మధ్య ఉన్న ప్రేమ విషయం వెల్లడించారు. త్వరలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. తమ మధ్య ఉన్న ప్రేమ బంధానికి పెద్దగా హైప్ ఇవ్వడం ఇష్టం లేకనే ఇంతకాలం ఈ విషయాన్ని దాచినట్లు తెలిపారు.
సిద్ధార్థ కూడా తన ప్రేమ విషయం ఓపెన్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ' గత ఆరు నెలలుగా తాము ప్రేమలో ఉన్నాం. కావాలనే సీక్రెట్ గా మా ప్రేమను మెయింటేన్ చేసాం. విషయాన్ని బయట పెట్టుకుని అనవసర ఇబ్బందుల పాలవ్వడం ఇష్టం లేకనే అలా చేసాం' అని తెలిపారు. ప్రస్తుతం తాము వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నామని, అవి పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటామని, బహుషా డిసెంబర్ 2013లో తమ పెళ్లి ఉండే అవకాశం ఉందని సిద్ధార్థ తెలిపారు.
పెళ్లి, రిసెప్షన్, హనీమూన్ వివరాలు స్లైడ్ షోలో మరిన్ని వివరాలు

తిరుపతిలో సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకోవాలని, ఈ వేడుకను సింపుల్ గా స్నేహితులు, బంధువుల మధ్య మాత్రమే జరుపుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు.

పెళ్లి తర్వాత వీరు గ్రాండ్ గా హైదరాబాద్ లోని 7స్టార్ హోటల్ లో రిసెప్షన్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి పరిశ్రమకు చెందిన పలువురు హాజరు కానున్నారు.

సిద్ధార్థ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమల నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

పెళ్లి తర్వాత వారం రోజులకు ఆస్ట్రేలియాకు హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు.

పెళ్లి వేడుకపై ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ ఇద్దరు అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారు.

మీరు ఈ వార్తను నిజంగా నమ్ముతున్నారా? అయితే అసలు విసయం తెలుసుకోండి. హాప్పీ ఫూల్స్ డే. మీరు విన్నది నిజమే. ఇది నిజమైన వార్త కాదు. కేవలం ఫూల్స్ డే సందర్భంగా సృష్టించిన గాలి వార్త.


Click it and Unblock the Notifications











