రౌడీ సమంత... ‘జబర్‌దస్త్’ రిలీజ్ డేట్
హైదరాబాద్: సిద్ధార్థ-సమంత జంటగా నటిస్తున్న 'జబర్‌దస్త్' మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 21న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'అలా మొదలైంది' ఫేం నందినీరెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నండగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో నిన్న విడుదలైనంది. తమన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలా మొదలైంది చిత్రాన్ని యూత్ అండ్ ఫ్యామిలీ మెచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకురాలు నందినీరెడ్డి 'జబర్‌దస్త్' చిత్రాన్ని మాస్ మసాలా అంశాలతో తెరకెక్కించారు.
ఈ చిత్రంలో సిద్ధార్థ పాత్ర విభిన్నంగా ఉండటంతో మంచి కామెడీ టైమింగుతో ఉంటుంది. అదే విధంగా హీరోయిన్ సమంత పాత్ర రౌడీలా ఉంటుందట. ఈ విషయాలు స్వయంగా దర్శకురాలు నందినీ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి ఈచిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది అంటున్నారు.
ఈచిత్రం గురించి నిర్మాత బెల్లకొండ సురేష్ మాట్లాడుతూ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నాం. మొదట్టలో సిద్దార్థతో సినిమా అంటే లాసవుతావని అంతా అన్నారు. కానీ మా ఆవిడ మాత్రం సిద్ధార్థ, నందినీతో చేయమని ప్రోత్సహించింది. విడుదలకు ముందు ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తెచ్చి పెట్టింది అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











