సిద్ధార్థ, సమంత, నందినిరెడ్డి సినిమా ఫిబ్రవరి 2 నుంచి
సిద్ధార్థ, సమంత జంటగా 'అలా మొదలైంది' దర్శకురాలు బి.వి నందినిరెడ్డి దర్శకత్వంలో సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ రెడ్డి గతంలోనే అధికారిక ప్రకటన చేశారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ మెంట్ విషయంలో బెల్లకొండ సురేష్ కి సమంతకి మధ్య విబేధాలు రావడంతో సినిమా షూటింగ్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. విషయం ఫిల్మ్ ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు వెళ్లింది. డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని బెల్లకొండ ఫిర్యాదు చేస్తే....షూటింగ్ డేట్స్ ముందే ఖరారు చేయక పోవడంతో నేను వేరే సినిమాలకు కమిట్ అయ్యానని సమంత వాదించింది. ఎట్టకేలకు ఇరువురి మధ్య రాజీ కుదరడంతో వివాదం సద్దుమనిగింది.
ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపాలని నిర్ణయించారు. ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. కందిరీగ, కాంచన, బాడీగార్డ్ వరుస హిట్లతో దూసుకెలుతున్న నిర్మాత బెల్లకొండ ఈ సినిమాను విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సమంత ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' చెట్టు చిత్రంతో పాటు, రాజమౌళితో చిత్రం 'ఈగ'లోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











