సిద్ధార్థ, సమంత సినిమాకు వెంకీ క్లాప్
సిద్దార్థ-సమంత జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం ఈరోజు (ఫిబ్రవరి 2) ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్య్రకమానికి ఇంకా గోపీచంద్ మలినేని తదితరులు హాజరయ్యారు. బెల్లకొండ సురేష్ ఈ చిత్రాన్ని సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా హీరోయిన్ సమంత-బెల్లంకొండ సురేష్ మధ్య డేట్స్ విషయంలో ఏర్పడిన విబేధాల వల్ల ఆలస్యం అయింది. బెల్లంకొండ ఫిర్యాదుతో వీరి విబేధాలు ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇందులో కలుగ జేసుకోవడంతో చివరకు ఇద్దరి మధ్య రాజీ కుదిరింది.
దర్శకురాలు నందినీ రెడ్డి గతంలో 'అలా మొదలైంది' సినిమాకు దర్శకత్వం వహించింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నందినీరెడ్డి దర్శకత్వంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











