సమంత-సిద్ధార్థ్ ‘జబర్‌దస్త్’ సెన్సార్ రిపోర్ట్

By Bojja Kumar

హైదరాబాద్: సిద్ధార్థ-సమంత జంటగా నటిస్తున్న 'జబర్‌దస్త్' మూవీ ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్స్ బోర్డ్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఫిబ్రవరి 22న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'అలా మొదలైంది' ఫేం నందినీరెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నండగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Jabardasth

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. అలా మొదలైంది చిత్రాన్ని యూత్ అండ్ ఫ్యామిలీ మెచ్చేలా వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకురాలు నందినీరెడ్డి 'జబర్‌దస్త్' చిత్రాన్ని మాస్ మసాలా అంశాలతో తెరకెక్కించారు.

ఈ చిత్రంలో సిద్ధార్థ పాత్ర విభిన్నంగా ఉండటంతో మంచి కామెడీ టైమింగుతో ఉంటుంది. అదే విధంగా హీరోయిన్ సమంత పాత్ర రౌడీలా ఉంటుందట. ఈ విషయాలు స్వయంగా దర్శకురాలు నందినీ రెడ్డి వెల్లడించారు. మొత్తానికి ఈచిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది అంటున్నారు.

సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి .మహేంద్రబాబు, నిర్మాత : బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.నందినిరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X