సినిమా పోతేనేం సిద్దార్ధ రెండు కోరికలు తీరాయి

By Srikanya

నాకున్న రెండు కోరికలూ 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తీరాయి అంటున్నారు సిద్దార్ద. ఇంతకీ ఆ రెండు కోరికలూ ఏమిటీ అంటే...యాక్షన్‌ చేయడం అంటే నాకిష్టం అది ఈ చిత్రంతో తీరింది. అలాగే 'పాతాళ భైరవి'లాంటి చిత్రంలో నటించాలి ఎప్పుడూ అనేకునేవాడిని..ఈ రెండు కోరికలు 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో నెరవేరాయి. పిల్లలకు, మహిళలకు ఈ సినిమా బాగా నచ్చుతోందంటూంటే హ్యాపీగా ఉంది అన్నారు సిద్దార్ద. అలాగే తెలుగు సినిమాలో ఈ తరహా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇంత వరకూ రాలేదని రామ్‌గోపాల్‌ వర్మ లాంటి దర్శకులు చెప్పడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌, కాంతారావు నటించిన జానపద చిత్రాలు చాలానే చూశాను. ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా ఓ అందమైన చందమామ కథలా ఈ సినిమాను తీర్చిదిద్దారుఅదే నాకు నచ్చింది అని చెప్పారు. ఇక తదుపరి చిత్రాలు గురించి చెబుతూ...త్వరలోనే దిల్‌ రాజు నిర్మాతగా 'బొమ్మరిల్లు' తరహాలో ఓ చక్కటి ప్రేమ కథలో నటిస్తున్నాను. వచ్చే నెల్లో ఈ సినిమా మొదలవుతుంది. '180', దీపా మెహతా దర్శకత్వంలో వస్తున్న 'మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌' చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X