సిద్ధార్థ్ ట్విట్టర్ హ్యాక్.. అత్యంత దుర్మార్గంగా హ్యకర్లు ట్వీట్లు..
గృహం చిత్ర విజయంతో మంచి ఊపుమీద ఉన్న నటుడు సిద్ధార్థ్‌కు షాక్ తగిలింది. తన ట్విట్టర్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యకింగ్‌కు పాల్పడ్డారు.
గృహం చిత్ర విజయంతో మంచి ఊపుమీద ఉన్న నటుడు సిద్ధార్థ్‌కు షాక్ తగిలింది. తన ట్విట్టర్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యకింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయంపై సిద్ధార్థ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అకౌంట్‌ను పునరుద్ధరించడంతో ప్రమాదం తప్పింది.
Recommended Video


టీపీ2పాయింట్0 సినిమా గురించి
అంత సవ్యంగానే జరిగిపోతున్నది. టీపీ2పాయింట్0 చిత్ర రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేయనున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. సీ సముదన్ రూపొందించే క్లాసిక్ అని సిద్ధార్థ్ ట్వీట్ చేసినట్టుగా హ్యకర్లు చేశారు.
టీపీ2పాయింట్0 సినిమా రిలీజ్
హ్యాకర్లు ఈ చిత్రం థియేటర్లలో మే 25, 2018లో రిలీజ్ అవుతుంది. పైరసీ వెబ్‌సైట్ తమిళ్ రాకర్స్‌లో 26 మే, 208లో రిలీజ్ కానున్నది అని హ్యాకర్లు ట్వీట్ చేశారు. శనివారం ఉదయమే ఈ ట్వీట్‌ను చూసిన సిద్ధార్థ్ షాక్ గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిద్ధార్థ్ అకౌంట్ హ్యాక్ గురించి
ఓ భయంకరమైన ప్రకటన మేం చేయాలనుకొంటున్నాం. అది సిద్ధార్థ్ చేస్తేనే బాగుంటుంది అని అనుకొన్నాం. ఆ ప్రకటన కోసం వేచి చూడండి అని తొలుత వై స్టూడియో ట్వీట్ చేసింది..
హ్యాకింగ్‌పై స్పందించిన సిద్ధార్థ్
వై స్టూడియో ట్వీట్ చేసిన తర్వాత ఈ వ్యవహారంపై సిద్ధార్థ్ స్పందించారు. సారీ నా ట్విట్టర్ అకౌంట్ 6 నిమిషాలపాటు హ్యాకింగ్ గురైంది. నేను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే వారు తగిన చర్యలు తీసుకొన్నారు. హ్యాకర్లు నా సినిమా గురించి కొన్ని అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేదు. థ్యాంక్యూ. #TP2point0 అని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











