పీటర్ ఇంగ్లాండ్ కి సెలెక్ట్ అయిన లవర్ బాయ్ సిద్దార్ధ... !
టాలీవుడ్ తాజా 'బావ' సిద్దార్ధ్ ప్రఖ్యాత దుస్తుల కంపెనీ 'పీటర్ ఇంగ్లాండ్' కి ప్రచార కర్తగా నియమించబడ్డాడు. అదే విషయమై 'ట్విట్టర్' లో సిద్దార్ధ్ ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచాలని అనుకున్నా కానీ… మీడియా కంట్లో పడకుండా ఏదీ బయటకి రాదు అని అర్ధమయ్యింది. భారతదేశంలో ప్రతి ఆరు సెకెండ్స్ ఒకసారి అమ్ముడుపోయ్యే దుస్తుల కంపెనీకి నేను ఇప్పుడు ప్రచార కర్తను. నేను ఎప్పటినుంచో వాడుతున్న 'పీటర్ ఇంగ్లాండ్'కంపెనీకి ఇప్పుడు నేను బ్రాండ్ అంబాసడర్ గా నియమింపబడటం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన యాడ్ త్వరలోనే టి. వి. ల్లో ప్రసారమవుతుంది. ఆ యాడ్ రూపకర్త దర్శకుడు జాప్, మరియు ఛాయాగ్రాహకుడు సునీల్ పటేల్ లతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. ఒక్కరనే కాదు…మొత్తం 'పీటర్ ఇంగ్లాండ్' టీమ్ ఎంతో మంచిది' అంటూ తెలిపాడు. ఇక ప్రస్తుతం కె రాఘవేంద్ర రావు దర్శకుడి కుమారుడైన ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ హీరోయిన్ 'అనగనగా ఒక ధీరుడు" సినిమా చివరి దశలో షూటింగ్ జరుపుకొంటోందని తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











