మహేష్ బాబునే నమ్ముకున్న సిద్ధార్థ!
హీరో సిద్ధార్థ మహేష్ బాబును నమ్ముకోవడం ఏమిటి?..వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఈ విషయం వాస్తవం అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ఇందుకు ఓ బలమైన సెంటిముంటు కారణం కూడా చెబుతున్నారు. ఆ సెంటిమెంటు ఇప్పడు కూడా కలిసొస్తుందని నమ్ముతున్నాడట సిద్దార్థ. అసలు వివరాల్లోకి వెళితే....ఆ మధ్య మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సిసినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత విడుదలైన సిద్ధార్థ బొమ్మరిల్లు సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబుకు సరైన హిట్ లేదు, సిద్దార్థ కూడా ఒక్క విజయం కూడా తన ఖాతాలో వేసుకోలేదు. తాజాగా మహష్ బాబు దూకుడు గా వచ్చి హిట్ కొట్టాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో మహేష్ బాబుకు విజయం కలిసొస్తే తనకూ కలిసొస్తుందని నమ్మకం పెట్టుకున్నాడట సిద్ధార్థ. ఇప్పడు దూకుడు మంచి విజయం సాధించింది కాబట్టి మళ్లీ సెంటిమెంటు రిపీట్ అయి తాజాగా విడుదల కాబోతున్న తన సినిమా 'ఓ మై ఫ్రెండ్" సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాడట సిద్ధార్థ. మరి సిద్ధార్థ నమ్మకం ఫలిస్తుందో..? లేదో..?. ఓ మై ఫ్రెండ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మాత.


Click it and Unblock the Notifications











