పుష్ప 2 పై హీరో సిద్దార్థ షాకింగ్ వ్యాఖ్యలు.. అల్లు అర్జున్ రియాక్షన్ ఎలా ఉంటుందో మరీ..
Siddharth On Pushap 2: ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పుష్ప 2 సినిమా ప్రస్తావననే. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం ఐదు రోజుల్లో దాదాపు 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే మరికొన్ని రోజులలో 1000 కోట్ల మార్కును త్వరలోనే క్రాస్ చేయబోతుంది. ఈ పాన్ ఇండియా సినిమా విడుదల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాలలో ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పుష్ప ఈవెంట్స్ పై హీరో సిద్ధార్థ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన సినిమా పుష్ప 2. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా.. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 సినిమా రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీస్ వద్ద పలు ప్యాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ నయా రికార్డులను సృష్టిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప 2 సినిమా విడుదల ముందు ప్రమోషన్ లో భాగంగా దేశంలోని పలు నగరాలలో ప్రమోషన్స్ ఈవెంట్స్ ను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 టీజర్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు రెండు లక్షల పైగా అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ సక్సెస్ తో దేశంలోని పలు నగరాలలో ప్రమోషన్స్ ఈవెంట్ను నిర్వహించారు. అక్కడ కూడా పుష్ప రాజ్ హవా కొనసాగించారు. భారీ ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈవెంట్స్ కు హాజరై సక్సెస్ చేశారు. అయితే బీహార్ లోని పాట్నాలో నిర్వహించిన పుష్పట్టు టీజర్ రిలీజ్ ఈవెంట్ పై నటుడు సిద్ధార్థ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం సిద్ధార్థ 'మిస్ యు' అనే సినిమాతో ముందుకు వస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా నవంబర్ 29 విడుదల కావాల్సి ఉంది. కానీ, తుపాను కారణంగా ఈ సినిమాను డిసెంబర్ 13న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చిత్ర బంధం ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటుంది. ఈ క్రమంలో సిద్ధార్థ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమాపై అక్కసు వెల్లగక్కాడు.పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈవెంట్ కు జనం తండోపతండాలుగా రావడం పై సిద్ధార్థ సెటైరికల్ గా కామెంట్స్ చేశారు.

మన దేశంలో జన సమీకరణ అనేది పెద్ద విషయమేమీ కాదని, అది మార్కెటింగ్ స్ట్రాటజీ అని అన్నారు. ఒక కన్స్ట్రక్షన్ దగ్గర జెసిపి వర్క్ జరుగుతున్న జనాలు గుమ్మికుడుతారని, బిర్యానీ, క్వార్టర్ సీసా ఇస్తే చాలు.. పొలిటికల్ మీటింగ్ కు జనాలు ఎగబడతారని పేర్కొన్నారు. అంతే కాకుండా.. పొలిటికల్ మీటింగ్స్ కు జనాలు వచ్చినంత మాత్రాన పార్టీలు గెలుస్తాయని, నమ్మకం లేమని, ఇండియాలో జనం గుమికూడడం సహజమే. అది చాలా చిన్న విషయం' అంటూ సిద్ధార్థ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం సిద్దార్థ వాక్యాలు నెట్టింట్లో వైరల్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ సిద్ధార్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











